హిందూ ధర్మం – 1

హిందూ ధర్మం – 1 ఈ ప్రపంచంలో అత్యంత పురాతనకాలం నుంచి జీవిస్తున్న ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ప్రపంచచరిత్రలో ఎన్నో మతాలు పుట్టాయి, ఎన్నో నాశనమయ్యాయి. కొత్తవి ఎన్నో పుడుతున్నాయి, కానీ ఎన్ని మతాలు వచ్చినా, కాలపరీక్షకు (Test of time) తట్టుకుని నిలబడ్డ ఏకైక నాగరికత హిందూ నాగరికత మాత్రమే. దాదాపు 1,200 సంవత్సరాల భయానకమైన పరదేశీయుల పరిపాలన, మత మార్పిడుల తరువాత కూడా, హిందూ ధర్మం ఇంకా అదే వైభవంతో వెలిగిపోతోంది. […]

మహాభారతం – ఆదిపర్వము

జనమేజయ మహారాజు యజ్ఞం చేస్తుండగా ఒక ”దేవ శునకం” ఆ యజ్ఞ ప్రదేశం చుట్టూ తిరుగుతుంది! అది చుసిన జనమేజయుడి తమ్ముళ్ళు ఆ కుక్కని కొట్టి తరిమేశారు! ఆ కుక్కపిల్ల వెళ్లి తనతల్లి శునకంతో అమ్మ నేను ఆ యజ్ఞాన్ని చూడాలనే ముచ్చటతో నేను అక్కడ సంచరిస్తుంటే ఆ జనమేజయ మహారాజు తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పి ఏడుస్తుంది! అది విన్న తల్లి శునకం తన పిల్లవాడిని తీసుకెళ్ళి అకారణంగా నా పిల్లవాడిని కనీస జ్ఞానంలేని […]

అర్జునవిషాద యోగము

ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 […]

Intro of Mahabharatham (మహాభారతం )

మహాభారతం హిందువులకు పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 500 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది.మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. […]

భగవద్గీత సారాంశం

 భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా| సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన స చర్చా|| శ్లోకం అర్ధం : భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని). || వసుదేవసుత౦ దేవ౦ క౦సఛాణూర‌ మర్ధన౦ దేవకీపరమాన౦ద౦ కృష్ణ౦ వ౦దే జగద్గురు౦ || […]

గీతా మాహాత్మ్యము -3 వ భాగం

గీతా మాహాత్మ్యము -3 వ భాగం గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్‌‌, వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యము నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫల మునివ్వక) వ్యర్థమే యగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమమాత్రమే యని చెప్పబడినది. ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః, స తత్ఫల మవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్‌. ఈ మాహాత్మ్యముతో బాటు గీతాపారాయణము చేయువాడు పైన తెలుపబడిన ఫలమును […]

గీతా మాహాత్మ్యము -2 వ భాగం

గీతా మాహాత్మ్యము -2 వ భాగం పాఠేసమర్థస్సంపూర్ణే తదర్ధం పాఠ మాచరేత్‌, తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు. త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్‌, షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్‌. గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) […]

గీతా మాహాత్మ్యము -1 వ భాగం

గీతా మాహాత్మ్యము -1 వ భాగం భగవన్‌ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ, ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు? ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత స్సదా స ముక్తస్స సుఖీ లోకే కర్నణా నోపలిప్యతే. శ్రీ విష్ణువు చెప్పెను – ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు […]