కామన్ మాన్ ప్రశ్నలకు సిబిఐ సమాధానం చెప్పగలుగుతుందా ?

జగన్ గారి “క్విట్ ప్రొ కొ” కేసు నుండి “ఇన్వెస్టర్ల మొసం” కి చెరిన సి.బి.ఐ

వై.యస్ జగన్ గారి మీద కాంగ్రెస్ , తెలుగుదేశం కలిసి మొపిన అభియొగాల కి “క్విట్ ప్రొ కొ” అని పేరు పెట్టుకున్నారు – క్విట్ ప్రొకొ కేసులలొ అభియొగాలు ఏదురుకున్న మెజారిటి ఐ.ఏ.యస్ అధికారులకి కొర్టు నుండి క్లీన్ చిట్ రావటం తొ సి.బి.ఐ వాదాన చార్చ్ షీట్ 2 లొ ఉన్న ఇన్వెస్టర్ల మొసం వై.పు మళ్ళింది..
_______________________________________________________

**ఈ చార్జ్ షీట్ ప్రకారం సి.బి.ఐ ఆరొపణ ఇది**

జయలక్ష్మి టెక్స్‌టైల్స్ ద్వారా టి.ఆర్.కన్నన్ రూ. 5 కోట్లు, మాధవ్ రామచంద్ర రూ. 19.65 కోట్లు, అరుణ్‌కుమార్ దండమూడి రూ. 10 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు. మొత్తం 34.65 కొట్లు.. జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి తప్పుడు మాటలు చెప్పి, లాభాల ఆశ చూపించి వారిచేత పెట్టుబడులు పెట్టించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ.
__________________________________________________________

*ఇది పసలేని కేసు అని తెలియటానికి ఇక్కడ సాదారణం గా వచ్చే అనుమానాలు*

1) సి.బి.ఐ ని కొర్టు విచారించమంది ప్రభుత్వం వలన జరిగిన మేళ్ళ మీద అంటే క్విట్ ప్రొ కొ మీద కాని ప్రభుత్వం నుండి ఎలాంటి లాభం పొందకుండా జగన్ గారి కంపెనీలలొ పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల మీద కాదు . కాని సి.బి.ఐ ఈ కేసు లొ ఇన్వెస్టర్ల ని మొసం చేశారు అని కేసు పెట్టింది

2) ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిన ఇన్వెస్టర్లయితే క్విడ్ ప్రో కో అనటం..ప్రభుత్వం నుండి ఏమీ చేపట్టని వారైతే మోసపోయారని చెప్పటం.. ఎంతవరకూ కరెక్టు?
జగతిలో కానీ, భారతి సిమెంట్‌లో కానీ పెట్టుబడి పెట్టి తాము మోసపోయినట్లు ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా ?

3) ప్రభుత్వం నుండి ఏ లబ్ది చెకూరని వీళ్ళు కూడా జగతి పబ్లికేషన్స్ లొ పెట్టుబడి పెట్టినప్పుడు – కెవలం లబ్ది పొందిన వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెట్టారు అనటం తప్పే కద ?

4)ఎక్కడైనా భాదితుడు వచ్చి నేను మొసపొయా అని చెప్పాలి ,ఇక్కడ వీళ్ళు చెప్పలేదు , ఈ లెక్కన భారత దేశం లొ ఎన్నొ కంపెనీలలొ ఎంతొ మంది పెట్టుబడులు పెట్టారు , ఇందులొ ఈ సి.బి.ఐ ఎన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి పెట్టుబడులని పెట్టినవాళ్ళని మీరు మొసపొయారు అని చెపుతుంది ?

5)కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? భారతి సిమెంట్‌లో ఇన్వెస్టర్లంతా లాభపడ్డారు కదా? అలాగే జగతి లొ పెట్టునడి పెట్టిన వారు నష్టపొలేదు కద , దాన్నెందుకు పట్టించుకోరు?

6) సాక్షి మీద అభియొగం మొపే సమయానికి – 35 ఏళ్లకు పైగా ఉన్న ఈనాడు పత్రిక సర్క్యులేషన్ 2009 ఏ.బి.సి ప్రకారం 13 లక్షలు దేశం లొ 10వ స్థానం. కాని ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అదే సమయం లొ ఆర్ యన్ ఐ ఆడిట్ ప్రకారం సాక్షి సర్క్యులేషన్ 12.83 లక్షలు తరువాత దేశ లొ 7వ స్థానం కి చెరింది

7) ‘సాక్షి’తో సమాన సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ 1800 కొట్ల నష్టాలలొ ఉండి కూడా తన విలువను రూ. 7,150 కోట్లుగా అంచనా కట్టినపుడు సాక్షి దాన్లో సగం తన కంపెనీ విలువ 3 వేల కొట్లు కూడా చెయ్యదా?

8)10 రూపాయల విలువైన సాక్షి షేరు రూ.350కి కేటాయిస్తే తప్పంటున్న వారికి…100 రూపాయల విలువైన ‘ఈనాడు’ షేరు ఒకొక్కటి 5,28,630 రూపాయల చొప్పున కేటాయిస్తే తప్పనిపించటం లేదేం?

9) 18,00 కొట్లు నష్టాలలొ ఉన్న ఈనాడు సుమారు 7 ఏళ్ళ కింద తన వాటాని విక్రయించింది , ఆ వాట కొనుకున్న రిలయన్స్ ఇండస్ట్రిస్ 2,600 కొట్లు పెట్టుబడి పెట్టింది , మరి ఈనాడు ఇప్పటి దాక ఒక్క పైసా అయిన తన ఇన్వెస్టర్లకు డివిడెంట్ ఇచ్చిందా, ఇది సి.బి.ఐ కి తెలియదా ? పత్రికా రంఘం లొ లాభాలు రావటానికి కాస్త సమయం పడుతుంది ఒక్క సారి సంస్థ లాభాలలొకి వచ్చింది అంటే అది అలా కొనసాగుతూ ఉంటుంది అని సి.బి.ఐ కి తెలియదా.

10 ) అన్ని పేజీలను రంగులలొ ముద్రిస్తు ఈనాడు కన్న మెరుగైన టెక్నాలజితొ , అంతర్జాతీయ డిజైన్ తొ ముందుకు వెల్తూ అభియొగం మొపే సమయానికి ఈనాడు కన్న రేటింది లొ ముందు ఉండి దేశం లొనే 7వ స్థానం సంపాదించిన సాక్షి గనుక పబ్లిక్ ఇష్యు కి వెళ్ళినా, ప్రైయివేట్ ప్లేస్మెంట్ చెసినా ఇన్వెస్టర్లకి లాభాలు రావా ?

ఇక్కడ ఏ పాయింట్ ప్రకారం ఇన్వెస్టర్లు మొసపొయారు అని చెప్పటం సబబొ నాకు అర్ధం కాలేదు… ఇప్పటికే క్విట్ ప్రొ కొ అని చెప్పిన ఆ చార్జ్ షీట్లలొ అత్యదిక మంది శ్రీ లక్షీ , శ్యాం బాబ్ లాంటి ఐ.ఏ.యస్ ఆఫీసర్లకి ఎలాంటి అవకతవకలుజరగలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది , దీని బట్టి జగన్ గారి మీద మొపబడిన ఆ క్విట్ ప్రొకొ లొ ఎంత పస ఉందొ సామాన్యులకి సైతం అర్ధం అవుతుంది , ఇంకా తాజాగా సి.బి.ఐ తీసుకున్న ఈ ఇన్వెస్టర్ల మొసం సంగతి లొ కూడా అనేక ప్రశ్నలు ఏదురైతున్నాయి…

కర్టసి – కె ఆర్ సూర్య భగత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *