రాజారెడ్డి గారి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డి గారికి వుండే సంబంధం ఏంటి ?

రాజారెడ్డి గతమేంటి ? రెండో ప్రపంచ యుద్ధానికి రాజారెడ్డికి వుండే సంబంధం ఏంటి ?
రాజ్య పాలన చేసే వాళ్ళు రాజ్యాన్ని రక్షించుకోడానికి దుష్ట సంహారం చేస్తారు, అలా చెయ్యకపోతే రాజ్యం నాశనం అవుతుంది. రాజ్యాన్ని కాపాడడం కోసం చేసిన దుష్ట సంహారానికి ఈ పాడు లోకం పెట్టిన పేరు ఫ్యాక్షనిజం అని. ఒక వర్గ మీడియా పని కట్టుకొని చేసిన ప్రచారానికి భయపడి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా పాతళంలో పాతుకు పొయ్యాయి. రాజారెడ్డి గారి గురించి చేసిన దుష్ప్రచారానికి తెర దించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది జగన్ కోసం టీమ్.రాజా రెడ్డి గారి దేశ భక్తి గురించి తెలిస్తే ఎవరైనా ఉన్నపళంగా లేచి నించొని ఆయన నిలువెత్తు ఫోటో కు షెల్యూట్ చెయ్యాలని అనిపిస్తుంది. బ్రిటిష్ కోరల్లో చిక్కుకొని స్వాతంత్రం కోసం ఎదురుచూస్తున్న భరత మాతకు బ్రిటిష్ వంచకుల నుండి విముక్తి కలిగించడానికి నేను సైతం అని తూర్పున ఉదయించే సూర్యుడిలా తెలుగు నేల మీద కడప గడ్డ మీద ప్రాణాలకు తెగించి ముందడుగు వేసిన వ్యక్తి వై ఎస్ రాజా రెడ్డి ఫాథర్ ఆఫ్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్ర సమరయోధం లో అన్ని తానై పోరాటాన్ని ముందుకు నడిపించిన పొలిటికల్ పార్టీ. తన 15వ ఏటనే స్వతంత్ర పోరాటం గురించి పెద్దలు మాట్లాడే మాటలు విని స్ఫూర్తి పొందిన రాజారెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ఆకర్షితుడయ్యి దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టడమే తన లక్ష్యంగా తన వంతు పోరాటాన్ని మొదలు పెట్టిన వై ఎస్ రాజా రెడ్డి గారు రెండో ప్రపంచం యుద్ధం లో భారత సైన్యం తరపున బర్మా లో జపాన్ సైనికులతో పోరాటం చేసే వరకు వెళ్ళింది. స్వతంత్రానికి ముందు దేశం వందల సంస్థానాలుగా రాజ్యాలుగా ఉన్నింది అలాంటి పరిస్థితుల్లో ఒక మారుమూల పల్లెలో ఉన్న రాజారెడ్డి గారిని బర్మా లో మిలిటరీ పోరాటానికి సైనికుడిని చేసింది కేవలం దేశ భక్తే.

అసలు ఇండియన్ ఆర్మీ బర్మా లో యుద్ధం ఏంటి అంటే. బ్రిటిష్ వాళ్ళు ఇండియా ను పాలిస్తున్నట్టే బర్మా ను కూడా పాలించే వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు బర్మా మీద దండయాత్ర మొదలు పెట్టారు అప్పటికే బర్మా లోని కొన్ని కాలనీలను జపాన్ స్వాధీనం చేసుకుంది ఆ సమయం లో ఇండో బ్రిటిష్ ఆర్మీ జపాన్ సైనికులతో యుద్ధం చేయాల్సి వచ్చింది.
1939 లో రెండో ప్రపంచ యుద్ధం మొదలయినప్పుడు దేశం లో తిరుగుబాట్లు ఎక్కువ అయ్యి బ్రిటిష్ వాళ్ళు పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయారు. యుద్ధానికి బ్రిటిష్ ప్రభుత్వానికి సైనికులు కావాల్సి వచ్చింది ఆ పరిస్థితులలో అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలతో స్వాతంత్రం ఇస్తాము మీ దేశ యువకులు యుద్ధం లో పాల్గొనండి అని అడిగింది మొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోలేదు స్వాతంత్రం ఇప్పుడు ఇవ్వండి మేము మీతో పాటు యుద్ధం లో పాల్గొంటాం అని తిరుగుబాటు చేసినా చివరికి బ్రిటిష్ వారి మాటలకు తలొగ్గాల్సి వచ్చింది. ఆ ఒప్పందంలో భాగంగా స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొంటున్న అందరూ ఇండో బ్రిటిష్ మిలిటరీ లో భాగస్వామ్యం అయ్యి సైనిక పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

                 ఆ పిలుపును అందుకొని మిలిటరీలో జాయిన్ అయిన రాజారెడ్డి గారు బర్మా వెళ్లి జపాన్ సైనికులతో పోరాడి 1945 లో తిరిగి స్వగ్రామం చేరుకున్నారు రాజారెడ్డి గారు.కన్న భూమి కోసం భరత మాత కోసం తన ప్రాణాలను అడ్డుగా పెట్టిన ఒక వీరుడికి ఈ లోకం లోని ఒక వర్గం పెట్టిన పేరు ఫ్యాక్షనిస్ట్ అని .

యుద్ధం లో జరిగిన అతి ముఖ్యమైన విషయం గురించి తర్వాత ఎపిసోడ్ లో తెల్సుకుందాం…..

Contact Us At :- jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *