తండ్రి గుండెల మీద కత్తి దిగినప్పుడు తండ్రి ప్రాణం ముఖ్యమా మతం ముఖ్యమా ?

తండ్రి గుండెల మీద కత్తి దిగినప్పుడు తండ్రి ప్రాణం ముఖ్యమా మతం ముఖ్యమా ?
బర్మాలో రెండో ప్రపంచ యుద్ధం లో బలవంతపు మత మార్పిడి మరవకముందే తండ్రి గుండెల మీద కత్తి దింపి మతం మార్చారు.
బర్మా లో 1812-1863 మధ్యలో క్రిష్టియన్ మిషనరీస్ మొదలయ్యాయి బర్మా ప్రజలు కూడా ఒక రకంగా అలవాటు పడి కొన్ని కాలనీలు కూడా ఏర్పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం లో బర్మా మీద ఆధిపత్యం కోసం జపాన్ బ్రిటన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పుడు బర్మా లో వుండే లో చర్చ్ లను కూలగొట్టి ప్రజల విశ్వాసాలా మీద దెబ్బ కొట్టి భయభ్రాంతులకు గురి చేసి వారిని తమ ఆధీనంలో ఉంచొకోవాలనే ప్రయత్నం ముమ్మరం చేసింది జపాన్ సైన్యం. ఆ సమయంలో మరో వైపు బర్మా ప్రజలకు తమ మీద నమ్మకం కలిగించి మరి కొంత కాలం తమ ఆధీనంలో బర్మాను ఉంచుకోవాలని బ్రిటిష్ వాళ్ళు బర్మా ప్రజల విశ్వాసాలను క్యాష్ చేసుకోడానికి ఇండియా నుండి వెళ్ళిన యువ సైనికులను ఎరలు గా వాడుకున్నారు. స్వాతంత్రం ఇస్తామని నమ్మించి ఇండియా నుండి తీసుకెళ్లిన భారత సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం బర్మాలో బలవంతంగా మత మార్పిడి చేశారు.
ఆ చేదు అనుభవం తర్వాత కూడా గుండె నిబ్బరం చేసుకొని 1945 లో స్వగ్రామం తిరిగి వచ్చిన రాజా రెడ్డి గారికి ఊరిలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఊరిలో అనాదిగా వస్తున్న ఆచారాలలో ఒకటి అయిన శ్రీరామనవమి వేడుకలు ఆ సంవత్సరం జరపడానికి కూడా అప్పటి  గ్రామ పెద్దలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం అనిపించింది. గ్రామ పెద్దలు ఎవ్వరూ ముందుకు రాకపోయినా మన ఆచారాలను మనం పాటించాలి అని అన్ని తానై శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు రాజారేడ్డి. ఆ మరుసటి రోజు అతిథులుగా వచ్చిన ఇద్దరూ ఫారినర్లు భోజనం అని అడిగి ఇంట్లోకి వచ్చి తన కళ్ళెదుట తండ్రి గుండెల మీద కత్తితో పొడిచి భయభ్రాంతులకు గురి చేసి బలవంతంగా మతం మార్చారు.

తల్లి తండ్రి గురువు దైవం అంటూ పురాణాలలో కూడా తల్లి తండ్రులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తండ్రి మాటకు గౌరవమిచ్చి రాజ్యాన్ని వదులుకొని అడవులపాలయ్యి కష్టాలు పడిన రాముడు గురించి చదివాము అలాగే . తండ్రి కోసం బ్రహ్మచర్యం తీసుకున్న భీష్ముడి గురించి కూడా చదివాము. 25 సంవత్సరాలు కనీ పెంచిన తండ్రి ప్రాణం కాపాడుకోడానికి రాజారెడ్డి గారు చివరికి ఆ ఊరు వదిలి పులివెందుల రావాల్సి వచ్చింది.

               చివరగా చెప్పేది ఏంటి అంటే అన్ని మతాల ఒక్కటే ఈ కులాలకు మతాలకంటే ముందు మనం మనుషులం, మనిషిగా బ్రతుకుదాం మానవత్వం తో బ్రతుకుదాం. దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి కులమతాలను సృష్టించి కులానికో దేవుడు మతానికో దేవుడు అంటూ ఆ దేవుడిని కూడా మళ్లీ సృష్టించే ప్రయత్నం చేయడం మానవాళికి మంచిది కాదు.

 

1999 ఎన్నికల ముందు భర్త రాజారెడ్డి గారి గురించి కొడుకు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వై ఎస్ జయమ్మ గారు ఒక నేషనల్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ కోసం ప్రత్యేకంగా మీ జగన్ కోసం లో
మా మెయిల్ ఐడి jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *