జగన్ ఒక సూపర్ కంప్యూటర్

 

పరిచయం :-

జగన్ గారి చిన్న నాటి స్నేహితుల్లో జె. జగన్ రెడ్డి , ఈయన రఘురాం సిమెంట్స్ ఎం.డి. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన 6 వ తరగతి నుండి ఫ్రెండ్షిప్. ఒక రకంగా ఇద్దరు కలిసే పెరిగారు , విజయమ్మ గారు కూడా ఈయనను సొంత కొడుకులా చూసుకొనే వారు, ఇద్దరు కలిసి పెరిగారు . ఈయన ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ చదివారు, పక్క దేశం పొయ్యి అక్కడ ఎదగాలి అని కళలు కన్న ఈయన ఇక్కడ పరిశ్రమలు పెట్టు విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించాలి అని జగన్ గారు పిలుపునివ్వడంతో ఆయన ఆలోచనలు అన్ని పక్కన పెట్టి ఇక్కడ రఘురాం సిమెంట్స్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు .

జగన్ ఒక సూపర్ కంప్యుటర్ :-

నిజమే జగన్ ధీ 100 టెరా బైట్ మెమొరినే భవిష్యత్తు కంప్యుటర్ కు తీసిపోడు జగన్, ఆ మెమొరి పవర్, మనుషుల్ని అర్థం చేసుకోవడం, సమస్యను విశ్లేషించడం అన్ని ఒక సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ను తలపిస్తాయి .
ఒక మనిషిని చుసిన మరు క్షణమే వాడి జాతకం చెబుతాడు, అబ్జర్వేషన్ కాలిక్యులేషన్ జగన్ కు బాగా తెలుసు . ఎదుటి వ్యక్తిని అంచనా వేస్తాడు , వాళ్ళ మాటల్ని బట్టి మనసులోనే తూకమేస్తాడు , ఎదుటి వాళ్ళు చేసే తప్పుల్ని క్షమిస్తాడు, పని చేసే వ్యక్తులే తప్పు చేస్తారు , పని చేయని సోమరులు ఏ తప్పూ చేయరు అని అంటూ ఉంటాడు . ఎదుటి వ్యక్తి ఏ పని మీద దగ్గరికి వచ్చాడన్నది గ్రహిస్తాడు , ఆ పనిలో ఎంతవరకు న్యాయమున్నది అనే విషయాన్ని మనసులోనే నిర్ణయించుకొని అది పదిమందికి ఉపయోగపడేది అయితే చేస్తాడు లేకుంటే లేదు . కోపమొస్తే బ్యాలన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు చిరాకులు చికాకులు వున్నప్పుడు అడ్జస్ట్ అవుతాడు ఎంత కోపంలో వున్నా కొత్తవారితో శాంతంగా ప్రవర్తిస్తాడు .
అయన జ్ఞాపక శక్తి అమోగం :-
జగన్ జ్ఞాపక శక్తి కూడా నన్ను అబ్బుర పరుస్తుంది , సిమెంట్ ఫ్యాక్టరికి సంబంధించి అన్ని నేనే చూసుకుంటూ ఉంటా , పని ఒత్తిడి పెరిగి ఏదో ఒకటి మరచిపోతా , పని ఒత్తిడిలో ఇది తప్పదేమో అనుకుంటా , కాని జగన్ కు ఒక పని కాదు పవర్ ప్లాంట్స్ , పేపర్ చానల్ , స్పిన్నింగ్ మిల్స్ , సామాజిక కార్యక్రమాలు రాజకీయ జీవితం ఇలా ఇన్ని వున్నా కూడా ఏది మిస్ కాకుండా చూసుకుంటాడు . వ్యాపారంలో వున్నప్పుడు వ్యాపారం, రాజకీయంలో వున్నప్పుడు రాజకీయం కుటుంభం లో వున్నప్పుడు కుటుంభం ఏది మరచిపోడు దేన్ని తక్కువ చేసి చూడడు , ప్రతి దానికి పద్దతిగా సమయాన్ని కేటాయిస్తాడు , ఇదే ఆయనలోని గొప్పదనం .
స్కూల్ లో కూడా గంటలు గంటలు చదివేవాడు కాదు, క్లాసులో చెప్పింది విని పరిక్షలు రాసేవాడు. దాదాపు 80 శాతం మార్కులు తెచ్చుకొనే వాడు. వ్యాపారాభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు బాగా చదివేవాడు , అకౌంట్స్ అంటే బాగా ఇష్టం 96 శాతం మార్కులు తెచ్చుకొనే వాడు .
ప్రతి చిన్న విషయమూ ఆయనకు గుర్తు వుంటుంది, ప్రతి విషయమూ ఆయనే స్వయంగా ఫాలో అప్ చేస్తారు మేము మర్చిపోతే తీవ్రంగా మందలిస్తారు, మనం సాయం చేస్తామనే నమ్మకంతోనే కదా అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకోడానికి ఇంత దూరం వస్తారు ? వాళ్ళ సమస్యలు విని మనం మరచిపోతే ఎట్లా ? అని అంటుంటారు . దీనికి సంబంధించి ఒక విషయం కచ్చితంగా చెప్పుకోవాలి ఒక సారి కమలాపురం మైనారిటీ నాయకుడు జిలాని కుమార్తె వివాహానికి జగన్ ను ఆహ్వానించారు పెళ్ళికి హాజరు అయ్యే సమయం లేకపోవడంతో ఆ తర్వాత వారి ఇంటికి మధ్యాహ్న బోజనానిని వెళ్ళారు , తిరుగు ప్రయాణంలో వుండగా కొందరు జగన్ కారును ఆపారు , జనాన్ని చూసి కారు దిగిన జగన్ కు వాళ్ళు సుబ్రహ్మణ్యం అనే కిడ్ని పేషంట్ గురించి ఆయనకు వున్నా సమస్య గురించి వివరించారు , అయన కమలాపురం నివాసీ , ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో వున్నాడు . సుబ్రహ్మణ్యం బాధను విన్న జగన్ ఆయనకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సాయం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తాను అని హామీ ఇచ్చారు దానికి తోడు అప్పటి వరకు అయన చికిత్స కోసం అయిన కర్చుల వివరాలు దాని తాలూకు బిల్లులు అన్ని అక్కడే వున్నా జగన్ పిఏ కి ఇవాళ్ళని చెప్పి ఆ వివరాలు అన్ని సేకరించి హైదరాబాద్ కు పంపాల్సింది గా పిఏ కి చెప్పాడు. జగన్ హైదరాబాద్ వెళ్ళగానే ఈ విషయం గుర్తు పెట్టుకొని కడప లో వున్న అయన పిఏ కి ఫోన్ చేసి అడిగారు దానికి అయన ఫైల్ పంపుతున్నాను సార్ అని సమాధానం చెప్పడంతో కేవలం పంపితే సరిపోదు ఆయనకు ఎన్ని రోజుల్లో సాయం అందుతుందో ఫోన్ చేసి చెప్పు. కష్టంలో వున్న వాళ్ళు చాలా టెన్షన్ గా వుంటారు సాయం ఎన్ని రోజుల్లోగా అందుతుందో అని చెప్పడం మన బాధ్యత దీని వళ్ళ వాళ్ళ టెన్షన్ తగ్గుతుంది అని అన్నాడు . అయన దగ్గరికి సాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరి పనిని గుర్తు పెట్టుకుంటారు . వాళ్లకు సంబంధించిన జాబితా మొత్తం అయన దగ్గర వుంటుంది ఒక సారి చెప్తే పనులు కావు నిరంతరం ఫాలో అప్ చేస్తూ వుండాలి అని అంటారు ఒకరికి సాయం చేయగలిగే అవకాశం అందరికి రాదూ. దాన్నొక వరంగా బావించాలి. పది మందిని నువ్వు గుర్తు పెట్టుకొని పని చేస్తేనే పది మంది నిన్ని గుర్తు పెట్టుకుంటారు అనేది జగన్ ఫిలాసఫి.

( జగన్మోహన్ రెడ్డి గారి బాల్య మిత్రుడు అయిన జి జగన్ రెడ్డి గారు 2008 లో చెప్పిన విషయాలు ఇవి )

( జగన్ గారి వ్యక్తిత్వం చిన్నతనంలో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యి ప్రజల మధ్య వుండి ప్రజల కోసం పని చెయ్యాలనే ఆయన ధృడ సంకల్పాన్ని జగన్ గారి అభిమానులకు అందరికి అందించాలనే ఉద్దేశంతో జగన్ కోసం టీం చేస్తున్న చిరు ప్రయత్నం )
జగన్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు మాతో పంచుకోవాలంటే దయచేసి మాతో సంప్రదించండి మా మెయిల్ ఐడి

jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *