మహాపురుషుడు – అఖిలాంధ్ర నాయకుడు

                                                 వై ఎస్ అంటే గుర్తు వచ్చేది తెలుగు ఠివి ఉట్టిపడే పంచె కట్టు , మరుమల్లెలాంటి తెల్లని ఖద్దరు కమీజు వేసుకొని, కుచ్చెళ్ళు పోసి ధరించిన ధోవతి పైకి దోపి అచ్చమైన రైతు బిడ్డ లాగా కదిలి వచ్చి రాష్ట్ర ప్రజానీకం కష్టనిష్టూరాలను కన్నీళ్లతో చూసి ఒక పరిష్కారం సాధించిన నాయకుడు , కష్టాల కడలిలో కూరుకుపోయి కాలమంతా కన్నీరు మున్నీరుమయమైన కడప వాసులందరికో ఏ సమయంలో వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టె దాతృత్వం, వారి మంచి చెడులు అడిగి తెలుసుకొనే మనస్తత్వం తనకు మించిన సాయం చేసే మంచితనం ఆయన్ను తిరుగులేని నాయకుడ్ని చేసాయి. వై ఎస్ వ్యక్తిత్వం విశిష్టమైనది, ప్రత్యేకమైనది, ఇక ముందు వస్తారని కూడా చెప్పలేము, బలమైన గ్రామీణ, స్థానిక పునాదులతో జాతీయ స్థాయిదాకా ఎదిగిన వ్యక్తి ఆయన . పల్లెటూరి అనుబంధాలు రాజకీయపు కాఠిన్యాలు, పరిపాలకుని ఔధార్యాలు కలగలసిన స్వభావం ఆయనది . విలవిలలాడుతున్న రాష్ట్ర ప్రజానీకం కష్టనిష్టూరాలను కన్నులారా చూసి ఓదార్చడానికి చండ్రనిప్పులు చెరిగే సూర్యుడు వెలవెల పోయేలాగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో 1500 కిలోమీటర్లు పాదయాత్ర చెయ్యడం ఆయనకు మాత్రమే చెల్లు. సామాన్య జనావాహినిలో ఒకరుగా కనిపించే ఆయన నిరాడంబరత, ఎవరినైనా బుజం తట్టి ఆప్యాయంగా పకరించే తీరు, పేద , బలహీన వర్గాలకు ప్రయోజనాలు అందేలా చూడడంలో ఆయన చూపిన శ్రద్ధ ఆయనకు మాత్రమే సొంతం .అయన లాంటి వారు రాజకీయాల్లో ఇంతవరకు లేరు ఇకముందు రారు .

                                                    వై ఎస్ ప్రజల మనిషి తనను నమ్ముకున్న వారికి తాను నమ్మిన వారికి ఆయన అభయప్రదాత, వజ్రసంకల్పుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణం ఇచ్చే మనిషి, మాట తప్పడం మడం తిప్పడం మా వంశంలో లేదు అని గర్వంగా అక్షరాలా అమలు చేసిన చూపారాయణ, ఆయన రైతు జన బాంధవుడు , అఖిలాంధ్ర ఆడపడుచులకు ఆయన పెద్దన్న, మిన్ను విరిగి మీద పడినా చలించని వ్యక్తి, పేదలు ఆయన పంచ ప్రాణాలు , ఆయన వదనం ఎప్పుడూ ప్రశాంతం. విసుగు, కోపం ఆయన దరికి రావు, చిరునవ్వు ఆయనకు దేవుడిచ్చిన వరం . తనకు లాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలనేది ఆయన ఆకాంక్ష, ఆయన దుస్తుల మాదిరిగానే మనసు కూడా స్వచ్ఛం నిష్కల్మషం . నమ్మిన సిద్ధాంతాన్ని జీవితమంతా పాటించారు , ఆయన రైతు బిడ్డ అందుకే ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం అందుకే ఆయన పులివెందుల, ఇడుపులపాయ వెళ్ళినప్పుడల్లా ఎస్టేట్ లో ఎక్కువ కాలం గడిపేవారు, రైతు ఆయన నేస్తం అందుకే ఆయన వ్యవసాయానికి పట్టం కట్టి పొలాలన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పండించి పుడమితల్లిని పులకింప చేసి పల్లెసీమను పచ్చని పైరు పంటలతో కళ కళ లాడాలని ప్రతి ఇల్లు ఆనందంతో విలసిల్లాలని రాష్ట్రాన్ని హరితాంధ్రగా తీర్చి దిద్దాలని సంకల్పించారు.

                                                   స్వీయ ప్రతిష్టను ఫణంగా పెట్టి అయినా నమ్ముకున్న వాళ్ళను ఆదుకున్న మిత్రశ్రేష్ఠుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు , నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం, నిరు పేద ప్రజానీకానికి అండగా నిలవడం ఆయనకు జన్మతో వచ్చిన గుణాలు, ఈ రెండు విశేషాంశాలు సమకాలీన రాజకీయ క్షేత్రంలోని నాయకులలో ఆయనను అసమాన నాయకుడిగా, బడుగువర్గాల పాలిటి ” ఆశాజ్యోతి ” గా రూపొందించాయి, ఎంత ప్రతికూల పరిస్థితులు వున్నా తాను నమ్మినదానికి కట్టుబడడం అందుకోసం పోరాడడం ఆయన నైజం , న్యాయం కోసం ఎంతటి వారినైనా ఎదిరించగల సాహసాలు, నిజం నిష్కర్షగా చెప్పే నైజం, ఏ అంశాన్నైనా విచక్షణతో ప్రజా పక్షపాతంతో ఆలోచించగల దమ్మున్న నాయకుడు అలాగే ఆచరించగల నేత , జలపాతంలాగా ధారాళంగా అటు శాసనసభలోను, ఇటు ప్రజా వేదికల పైనుంచి జన చైతన్యానికి దోహదం చేస్తూ మాట్లాడగలిగిన ప్రతిభ, ఏ పార్టీ వారైనా పక్షపాత ధోరణి లేకుండా నిరుపేద ప్రజానీకమైతే చాలు వారి సంక్షేమం కోసం వెనక్కి తగ్గకుండా స్పందించే ఎముక లేని చేయి ఆయనను ఒక అద్వితీయ నాయకుడిగా తీర్చిదిద్దాయి . అనునిత్యం జనం వద్దకు వెళ్లడం, వారి కష్ట సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకొని, పరిష్కారం కోసం వినూత్న కార్యక్రమాలను రచించడం, వాటిని చిత్తశుద్దితో అమలు చేయడం ఆయన విశిష్టత, ఆయన ఔదార్యం, తనను ఆశ్రయించిన వారికి సహాయం చెయ్యడానికి ఎంత వరకైనా వెళ్లగలిగిన విశాల హృదయం ఆయన శత్రువులు సైతం అభినందించకుండా ఉండలేరు, ఏ అమరికలు లేని ఒక ఆప్త మిత్రుడు , ఎప్పుడూ చిరు నవ్వుతో ఆప్యాయంగా వుండే సహధర్మ చారిని , నీడలా వెన్నంటి వుండే ఒక సహాయకుడు ఇన్ని అనుబంధాలే ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి . రాజకీయ జీవితంతో పాటు మనసున్న మనిషితనాన్ని, మంచిని, మన్నననూ , స్నేహానికి ప్రాణమిచ్చే ఉదాత్త స్పందననూ పెంచుకున్న వ్యక్తిత్వం ఆయనది , తనకు ముందున్న వారిలో సమకాలీనులలో ఎంతో మందిలో కనిపించని అపురూప గుణాలు ఆయన సొంతం, నమ్మిన వారికి వెన్ను కాయడం, తప్పు చేసిన వారిని పెద్ద మనసుతో క్షమించడం ఆయన నైజగుణం, మొండితనంతోనే మృదుత్వాన్ని రంగరించడం ఆయన జీవలక్షణం.

                                                వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారూ స్థానం సంపాదించుకున్నారు . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన అనంతరం జన్మించిన నాయకుడు, అందువల్ల త్యాగాల నేపధ్యం లేదు గత కీర్తి మీద బండి లాక్కొచ్చే అవకాశమూ లేదు, ఈ దేశం ఈ నేల ఎందరినో చూసింది పూర్వం రాజుల కాలం నుండి స్వాతంత్ర సమర యోధుల వరకు అందరిని చూసింది కానీ వాళ్ళు అందరూ అన్ని వర్గాల ప్రజలకు ఏమి చేశారు అంటే చెప్పలేకపోవచ్చు కానీ కేవలం ఐదేళ్లలో ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం కల్పించుకున్నారు , పుట్టుకతోనే గొప్పవాళ్ళ కుటుంభంలో పుట్టి గొప్ప వాళ్ళు అవుతారు మరి కొంతమంది సాధారణ స్థాయి నుండి పైకి వచ్చి ప్రజలకు సేవ చేసి మహాపురుషులు అవుతారు, దైవాంశ సంభూతులు అవుతారు ఇందులో మొదటి రకం మనుషులను ఎంతో మందిని చూసాము కానీ రెండో రకానికి చెందిన ఏకైక వ్యక్తి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు .

వై ఎస్ ఆర్ గారి వర్ధంతి సందర్బంగా ఆయన గురించి ఎక్కువ మందికి తెలియని పలు విషయాలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మరో వారం పాటు ఆయన జీవిత విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

Contact Us At :- jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *