సముద్రానికి జగన్ కు పొలికేంటి ?

సముద్రానికి జగన్ కు అసలు పొలికేంటి ?

నిజమే సముద్రానికి జగన్ కు పోలిక ఎలా పెడతాము ? ప్రశాంతంగా కనిపించే సముద్రం కోపం వస్తే ప్రళయాలు సృష్టించి మానవాళిని నాశనం చేస్తుంది . ఎక్కడో జరిగే చిన్న చిన్న అలజడులు అలలుగా మారి తుఫానుగా ప్రజల మీద విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సముద్రానికి అంత కోపం ఎందుకు అని అంటే. కృష్ణుడు ఏలిన ద్వారకా నగరాన్ని ముంచేసాను అనే గర్వంతో తో వచ్చిన కోపం .
కానీ కేవలం మానవ మాత్రుడు అయినా జగన్ కోప్పడడం ఎప్పుడూ చూడలేదు.
కోపం అనేది సర్వ సాధారణం. మానవ నైజం మరి కొంత మంది అయితే కోపం అనేది వారి జన్మ హక్కుగా భవిస్తూ ప్రవర్తిస్తుంటారు కానీ ఉన్నత స్థాయి లో ఉన్నప్పటికీ, చిన్న వయసులో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నప్పటికి జగన్ లో ఆ గర్వం కానీ ఆ గర్వం తాలూకా కోపం కానీ ఉండవు.
అటు వ్యాపార వేత్తగా రాజకీయ నాయకుడిగా గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఒక మనిషిగా జగన్ సాధించిన విజయాలు కీర్తి ప్రతిష్టలు సమాన్యమైనవి కాదు.
27 సంవత్సరాలక వయసులోనే బెంగళూర్ లో సండూరు పవర్ ప్లాంట్ మొదలు పెట్టడం అవ్వచ్చు లేకుంటే ప్రజలకు వాస్తవాలను చేరవేయ్యాలనే ఉద్దేశంతో దశాబ్దాలుగా ఏక చక్రాధిపథ్యాన్ని ప్రదర్శిస్తున్న పత్రికలకు పోటీగా పత్రిక పెట్టడం అవ్వచ్చు లేకుంటే స్థాపించిన కొన్ని రోజుల్లోనే విదేశీ టెక్నాలజీని అందింపుచ్చుకొని సిమెంట్ రంగంలో అగ్ర గామిగా నిలవడం అవ్వచ్చు వ్యాపారంలో జగన్ ఏది చేసినా అది సంచలనమే. వ్యాపార రంగంలో జగన్ విజయాలు బిజినెస్ స్కూల్స్ లో ఉత్సాహవంతులైన ఎంబీఏ విద్యార్థులకు అలాగె ఎంతో మంది ఎంటర్ప్రైనర్స్ కు కేస్ స్టడీగా మారింది అంటే జగన్ స్థాయి అర్థం అవుతుంది.
ఇక రాజకీయాలలో అయితే కొండను సైతం డీ కొట్టి మట్టి కరిపించాడు. కనుసైగతో పాలకులను వ్యవస్థలను శాసించే సోనియా గాంధీని డి కొట్టి నామరూపాలు లేకుండా చేసాడు. అతి తక్కువ వయసులో ఇన్ని విజయాలు సాదించినప్పటికి జగన్ లో ఏ రోజు ఆ గర్వం కనిపించలేదు. ఎప్పుడూ అదే చిరునవ్వుతో అదే ఆప్యాతతో ప్రశాంతంగా వుంటారు జగన్.
పిల్ల కాలువల నుండి ఏర్పడిన సముద్రం కూడా తన పుట్టుకను మరచి తన స్థాన బలాన్ని చూసి గర్వంతో విర్ర వీగుతుంది కానీ జగన్ లో అలాంటివి ఏ రోజు చూడలేదు. ఎన్ని విమర్శలు చేసినా ఎంత నీచంగా మాట్లాడినా జగన్ మౌనంగా వున్నాడు తప్ప ఏ రోజు కోపం ప్రదర్శించలేదు.
శతాబ్దాలుగా భూగోళామంతా విస్తరించిన సముద్రానికి కూడా సాధ్యపడని స్నితప్రజ్ఞత జగన్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *