ముసలి ఎన్టీఆర్ ను వేధించి చంపేశారు

ముసలి ఎన్టీఆర్ ను వేధించి చంపేశారు

                              చచ్చిపోయిన ముసలి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ఇటు రామోజీ పత్రిక అటు చంద్ర బాబు ఇద్దరూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారే మరి బ్రతికి వున్నప్పుడు ఎందుకు అంత దారుణంగా విసిగించారు ? ముసలోడైన ఎన్టీఆర్ మీద చంద్ర బాబు చెప్పులు వేపిస్తే, ముసలోడైన ఎన్టీఆర్ ను గేటు ముందు వెయిట్ చేపించిన ఘనుడు రామోజీ రావు. ఎన్టీఆర్ విషయంలో ద్రోహానికి ప్రతి రూపాలే రామోజీ రావు చంద్ర బాబు.
                                 అసలు విషయానికి వస్తే 1989 ఎన్నికల ఓటమి తర్వాత బాబుకు మామ కుర్చీపైన కన్ను పడింది, అనుకున్నదే ఆలస్యం అన్నట్టు రామోజీతో చేతులు కలిపి రేటు ఫిక్స్ చేసాడు. అప్పటి నుండి ఈనాడు పత్రికలో ముసలి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి, నీచంగా కార్టూన్స్ కూడా వేసే వారు. ఓ వైపు ఎన్టీఆర్ మీద చేడు ప్రచారం చేస్తూ మరోవైపు బాబే పార్టీలో నెంబర్ టూ అంటూ వరుస వార్తలు రాసి పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో చంద్ర బాబు లేకుంటే ఎన్టీఆర్ డమ్మీ అని ప్రచారం చేసారు . అటు పార్టీ వ్యవహారాలు ఇటు కుటుంభం వ్యవహారాలూ సైతం బాబే చూసుకుంటున్నాడు అని తన పత్రిక ద్వారా ప్రచారం చేసాడు. దీనితో అప్పటి తెలుగుదేశం పార్టీలో చంద్ర బాబు మెయిన్ పరవ్ సెంటర్ గా అవతరించాడు. అప్పటి నుండి ఎన్టీఆర్ కు తెలియకుండా పార్టీ నాయకులతో సంబంధాలు పెంచుకొని తానే టికెట్లు నిర్ణయిస్తాను అంటూ స్వయంగా ప్రకటించుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవడంతో చంద్ర బాబు ఆశలు అడియాసలు అయ్యాయి. అప్పుడే బాబు లోని నక్క నిద్ర లేచాడు ఎన్టీఆర్ ను మానసికంగా దెబ్బ తియ్యడానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మి పార్వతిని బూచిగా చూపిస్తూ ఎన్టీఆర్ ను కుటుంబానికి దూరం చేసాడు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఈనాడులో ఓ వైపు తెలుగుదేశం కు వ్యతిరేకంగా రాపిస్తూ మరో వైపు తెలుగుదేశంకు తాను మాత్రమే దిక్కు అని ప్రోజెక్ట్ చేపించుకున్నాడు. ఇవన్నీ చూసి కుమిలిపోయిన ఎన్టీఆర్ మనసు తెలుసుకున్న లక్ష్మి పార్వతి రామోజీ అపాయింట్మెంట్ తీసుకుంది.

బ్రింగింగ్ టూ ఈగోయిస్టిక్ బుల్స్ టూ గెదర్ :-

                                  ఆ అపాయింట్మెంట్ ను బ్రింగింగ్ టూ ఈగోయిస్టిక్ బుల్స్ టూ గెదర్ అంటూ వర్ణించారు లక్ష్మి పార్వతి, ఆ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు 20 సంవత్సరాల తర్వాత ప్రెస్ క్లబ్ తో మాట్లాడుతూ నాటి విషయాలు నెమరు వేసుకున్నారు. ఎన్టీఆర్ ఎంత పెద్ద సినీ హీరో అయినా అయుండచ్చు అప్పుడు అయన వయసు 71 సంవత్సరాలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రం కాబట్టి ఎన్నికల ప్రచారానికి ఎక్కువ తిరగడం కూడా కష్టం ఆ పరిస్థితుల్లో ఆయనకు ఒకపత్రిక అవసరం అయింది. అప్పుడు ఈనాడు పత్రిక రోజుకు 5 లక్షల పత్రికలు అమ్ముడుపోయ్యేవి కాబట్టి ఎన్నికల పత్రిక ఒకటి తమకు తోడుంటే బాగుంటుంది అని అలోచించి ఓక రోజు రామోజీ అపాయింట్మెంట్ తీసుకున్నాం. మా అంబాజిడర్ కార్ లో వెళ్ళాము కానీ రామోజీ గేటు కూడా ఓపెన్ చెయ్యలేదు అరగంట సేపు గేటు ముందే వెయిట్ చేయించాడు. నా భర్త ఎన్టీఆర్ జీవితంలోనే క్షణమొక యుగంలా గడిచిన క్షణాలు అవి. అయన మొహం కోపంతో ఎర్రబడి పోవడం నేను గమనిస్తూనే వున్నాను. అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది క్షమించరాని తప్పుగా భావించాను నేను కూడా . అరగంట నిరీక్షణ తర్వాత చివరికి రామోజీ రావ్ వచ్చి గేటు ఓపెన్ చేశారు కానీ ఆయనలో వెయిట్ చేయించి తప్పు చేసాను అనే భావనే కనిపించలేదు. నా భర్తా ఎన్టీఆర్, రామోజీ ఇద్దరూ పక్కన మాట్లాడుకుంటూ ఉండగా నేను రామోజీ భార్య రమాదేవితో మాట్లాడుతూ వున్నాను. వాళ్ళ మీటింగ్ అయిపోయాకా నాభర్త మోహంలో బాధను స్పష్టంగా గమనించాను. సపోర్ట్ చెయ్యమని నేను రామోజీ ని అడిగితే ” మేము చేసుకున్న సర్వే ప్రకారం గెలవడం కష్టం ఒక వేల గెలిచినా ఆరేడు సీట్లకంటే ఎక్కువ మెజారిటీ రాదూ ఆ మెజారితో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎక్కువ రోజులు ఉండలేరు అని అన్నాడు.

                                     చంద్ర బాబు రామోజీ చేతులు కలిపి తమకు ఎంతో సాయం చేసిన ఎన్టీఆర్ ను 71 సంవత్సరాల వయసులో గేటుముందు నిల్చోబెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *