పవిత్ర మక్కా మస్జీద్ లో జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు

దేశాలు మారినా ఖండాలు మారినా చెక్కు చెదరని రాజన్న ముద్ర.
చేసేది సాఫ్ట్ వెర్ ఉద్యోగం అది కూడా మన దేశం లో కాదు. కానీ దేశాలు మారినా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. వై యెస్ జగన్ గారు చెయ్యబోయే పాదయాత్ర ఎటువంటి ఆటంకం కలగకుండా జరగాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ముస్లిం ల పవిత్ర స్థలమైన మక్కా మజీదు లో పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు జగన్ కోసం టీమ్ సభ్యులు.

జగన్ కోసం టీమ్ సభ్యుడు షేక్ సలీం మాట్లాడుతూ జగనన్న చేయబోయే పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు రాకుడదని, ఆయన చేపట్టబోయే పాదయాత్రలో ఆయనకు అల్ల్హా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, జగనన్న కోరుకున్నట్టు ఈ పాదయాత్ర విజయవంతం కావాలని నేను నా ఫ్రేండ్స్ తో కలిసి మా ఆరాధ్యా ప్రదేశం మస్జిద్ ఎ మక్కాలో ప్రత్యేకంగా ప్రార్ధనలు చేసి, పవిత్ర ఉమ్రా కూడా చేసి ఆ తరువాత మేము చేసిన అన్ని నమాజుల పుణ్యం మైనార్టీలకు తోడుగా నిలిచే జగనన్నకు దక్కాలని దువా చేసుకోనే కార్యక్రమం కూడా చేసాము. ఈ ప్రార్థనలు కూడా నాకు అత్యంత ఆప్తులైనటువంటి మతగురువుల సలహాలను, సూచనలను తీసుకోని వారు చేప్పిన విధంగా నియమ పద్దతులను పాటించి జగనన్నకు మద్దతుగా ఉమ్రా చేసాము. మక్కాలో ఉండే కాబాలో జగనన్న ఫోటొలతో ప్రార్థన చేయడం నిషేధమైనప్పటికి ఆ రాజన్న ప్రవేశపేట్టిన ఫిజు రియింబర్స్ మెంట్ తో చదువుకోని ఈ రోజు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి గుండెల నిండ పెద్దాయనను నింపుకొని ప్రార్థనలు చేసాము అని చెప్పారు.

కులమత బేధం లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు తన పథకాలతో ఎందరినో చదివించాడు ఎందరి ప్రాణాలో కాపాడారు. ఆ అభిమానమే ఇక్కడ నుండి మక్కా మస్జీద్ వరకు వెళ్లి జగన్ కోసం ప్రార్ధనలు చేసేలా చేసింది.

Contact Us At – jagankosam.com@gmail.com

1 thought on “పవిత్ర మక్కా మస్జీద్ లో జగన్ కోసం ప్రత్యేక ప్రార్థనలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *