అంబులెన్స్ కు 108 అని పేరు పెట్టడానికి వెనుక వున్న రహస్యం

108 కు ఆ నెంబర్ ఎలా వచ్చింది ? ఇంత మంది ప్రాణాలను కాపాడుతున్న 108 లాంచ్ కు ముందు వై ఎస్ ఆర్ అలాగే 108 ఆపరేషన్స్ చూసుకోడానికి ముందుకు వచ్చిన జీవికె సంస్థ వాళ్ళు అన్ని ఆలోచించి చర్చించుకుని ప్రాణానికి సంబంధించి పురాతన గ్రంధాలలో ఉన్న వ్యాఖ్యలను నియమాలను అలాగే మనిషి యొక్క సైకాలజిని శాస్త్ర సాంకేతికతను, సూర్య చంద్రుల స్థితిని, ఆయుర్వేదం లోని మర్మాలను అలాగే భారత దేశంలోని న్యాయవ్యవస్థను అన్నిటిని పరిగణలోకి తీసుకుని 108 నెంబర్ ను పెట్టారు. దానికి సంబంధించిన వివరాలను జీవికె వాళ్ళు చెప్పిన .దాని ప్రకారం…..
1. ఇండియన్ ఏవిడెన్స్ యాక్ట్
ఇండియన్ ఏవిడెన్స్ యాక్ట్ 108, ఒక మనిషి బ్రతికే వున్నాడు అని ప్రూవ్ చెయ్యమంటుంది. అజ్ఞాతంలోకి వెళ్లినా లేక కనపడకుండా పోయిన ఒక మనిషి బ్రతికే వున్నాడు అని ప్రూవ్ చెయ్యమని 108 సెక్షన్ ఆఫ్ ఇండియన్ ఏవిడెన్స్ యాక్ట్ కోరుతుంది అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని 108 అంబులెన్స్ లోకి ఎక్కిస్తే వాళ్ళు సకాలంలో ఆసుపత్రికి తరలించి చికిత్స చెపిస్తారు అనే నమ్మకం ప్రజలలో కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణానికి భరోసా కల్పించడమే 108 ప్రధమ ఉద్దేశం. అందుకే వై ఎస్ ఆర్ గారు 108 అని నామకరణం చేసారు .
2.హిందు సాంప్రదాయం

హిందు సాంప్రదాయం ప్రకారం రుద్రాక్ష మాలలో 108 రుద్రాక్షలు వుంటాయి, రుద్రుడి స్వరూపాలే రుద్రాక్షలు అని అంటారు.  రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి అలాగే అత్యంత శక్తీ కలిగినవి. దేవుడి నామ జపం చేసేటపుడు 108 సార్లు చేస్తారు. హిందు ధర్మం ప్రకారం ఋషులు దేవతలు లోక క్షేమం కోసం దేవుడి మంత్రాలు ఉచ్చరించేటపుడు 108 సార్లు పలుకుతారు అలా పలికేటపుడు రుద్రాక్ష మాలలోని 108 రుద్రాక్షలు ఒక్కొక్కటి చేతి ముని వేళ్ళతో స్పర్శిస్తూ రుద్రాక్షలలోని ఈశ్వర శక్తిని మంత్ర శక్తికి జోడించి లోక కళ్యాణం కోసం కార్యాలను సిద్ధించేవారు అలాగే పేదల ప్రాణాలను కాపాడడానికి తాను ప్రవేశ పెట్టిన అంబులెన్స్ కూడా రుద్రాక్ష మాల లాగ అత్యంత శక్తివంతంగా ఉంటూ  ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ 108 అని నామకరణం చేసారు.

3. సైన్సు ప్రకారం / గ్రహ స్థితుల ప్రకారం

హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి జీవన్మరణాలు, మనిషి జీవితాన్ని అన్ని నిర్ణయించేది సూర్య చంద్రులే.  సమస్తకోటి జీవరాశికి శక్తిని ప్రసాదించేది కూడా సూర్య చంద్రులే . సూర్య చంద్రులకు బూమికి వున్న సంబంధం కూడా 108 అనే అంకె తోనే ముడివేసుకొని వుంది . సూర్యుడికి భూమికి మధ్యన వున్న యావరేజ్ డిస్టెన్స్ దాదాపు సూర్యుడి వ్యాసముకు 108 రెట్లు ఎక్కువ. అలాగే చంద్రుడికి బూమి కి మధ్యన వున్న యావరేజ్ డిస్టెన్స్ చంద్రుడి వ్యాసానికి దాదాపు 108 రెట్లు ఎక్కువ .అలాగే మనిషి జీవన్మరణాలు నిర్ణయించే గ్రహస్థితి కూడా అనుకోలించే విధంగా ఉండాలనే అంబులెన్స్ కు 108 పేరుతో నామకరణం చేసారు.

4. పురాణాలూ ఇతిహాసాలు

పురాణాలలో ఇతిహాసాలలో మనిషి పుట్టుక నుండి మరణం వరకు జరిగే మార్పులను వివరించారు వాటి ప్రకారం మనిషి జన్మం నుండి మరణం వరకు మనిషి ఆత్మ 108 వివిధ భాగాలుగా రూపాంతరం చెందుతూ ముందుకు వెలుతుంది. 108 శక్తి గీతలతో ఏర్పడిన చక్రం మనిషి ఆత్మను జీవితకాలం పాటు కాపాడుతూ వుంటుంది. అలాగే  తాను మొదలు పెట్టబోతున్న అంబులెన్స్ కూడా పేదల జీవిత కాలాన్ని పెంచేది గా వుండాలని వై ఎస్ ఆర్ అంబులెన్స్ కు 108 అని నామకరణం చేసారు.

5. ఆయుర్వేద ప్రకారం

భూమి పుట్టుక నుండి త్రేతా ద్వాపర యుగాల్లో కలి  యుగం లో కూడా ప్రాణాలను కాపాడుకుంటూ వస్తుంది ఆయుర్వేదమే , ఇప్పుడు ప్రజలు వాడుతున్న ఇంగ్లీష్ మందులు అన్ని ఆయుర్వేదం నుండి పుట్టుకొచ్చినవే. అటువంటి ఆయుర్వేదం లో కూడా మనిషి ప్రాణాలు నిలబెట్టే మర్మా లు 108. ఆయుర్వేదం లోని 108 మర్మాలు మనిషి ప్రాణాన్ని కాపాడుతున్నట్టు  108 కూడా మనిషి ప్రాణాలను కాపాడాలని 108 అని నామకరణం చేసారు.

6. భగవద్గీత

భగవద్గీత లోని 108 అతి ముఖ్యమైన శ్లోకాలు మనిషి జీవనం గురించి పాటించాల్చిన నీతి గురించి ప్రాణం విలువ గురించి బోదిస్తాయి అలాగే తాను ప్రవేశ పెడుతున్న అంబులెన్స్ కూడా మనిషి ప్రాణం విలువ తెలిసిననది అయుండి ధర్మాన్ని పాటిస్తూ వుండాలని వై ఎస్ ఆర్ అనుకొని 108 అని నామకరణం చేసారు.

ఇలా వివిధ సంప్రదాయ పురాతన సాంకేతిక న్యాయ విషయాలను పరిగణలోకి తీసుకొని వై ఎస్ ఆర్ గారు 108 నెంబర్ పెట్టారు  .

1 thought on “అంబులెన్స్ కు 108 అని పేరు పెట్టడానికి వెనుక వున్న రహస్యం”

  1. మీటర్ షేర్ చేసికోనందుకు అవ్వటము లేదు అందరికి షేర్ చెయ్యడం ఎలా ఫోటో ఒక్కటి కాదు కదా..జగన్ కోసం టీం కి హాట్స్ అప్ ..జై జగన్ ..జై ధర్మశ్రి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *