రౌడీల చరిత్ర నీది కాదా బాబు ?

1984 వ సంవత్సరంలో అది భాస్కర్ రావు తప్పో రాం లాల్ గారి తప్పో మరొకరి తప్పో అనే విషయం పక్కన పెడితే ఆ రోజు 26 మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని వందల బస్సులు తగలబడ్డాయి మరి ఆ రోజు ఆ 26 మందిని అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న రామారావు చంపాడా లేక పార్టీలో నెంబర్ 2 గా వున్న చంద్ర బాబు చంపించాడా ? అలాగే ఆ రోజు తగలబడ్డ వందలాది బస్సులు కాల్చింది కూడా ఆ రోజు అధికారంలో వున్న మామా అల్లుల్లదే గా ? అలాగే ఎన్టిఆర్ కు అధికారం పోయిన రోజు ఎన్టిఆర్ మాట్లాడుతూ వరదలై పారాలి రక్తం అంటూ పార్టి కార్యకర్తల చేత హింసకు ప్రేరేపించారు  ఆ రోజు ఎరులుగా పారాలి అని ఆశించింది పేద ప్రజల రక్తమా లేక తన రక్తమా ? పదవి కోసం హింసకు ప్రేరేపించిన వాళ్ళను ఏమనాలి ?  పూర్తిగా కరుడుకట్టిన రౌడి అయిన శ్రీశైలం యాదవ్ లాంటి రౌడి  500 కార్లతో వస్తే దండలు వేసి దండాలు పెట్టి పార్టీలో చేర్చుకున్న నీచ చరిత్ర చంద్ర బాబుది కాదా ?

1 thought on “రౌడీల చరిత్ర నీది కాదా బాబు ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *