మనకెందుకులే అని ఊరుకుందామా లేక జగన్ ను సీఎం చేసుకుందామా?

మనకెందుకులే అని ఊరుకుందామా లేక జగన్ ను సీఎం చేసుకుందామా?
రాష్ట్రం లో ఏమి జరిగినా ఎంత అరాచక పాలన సాగుతున్నా నాకెందుకు లే అని ఊరుకుందామా లేకా దుర్మార్గపు పాలన మీద యుద్ధం ప్రకటించిన జగన్ కు తోడుగా నిలబడదామా ?
ఎక్కడో గుంటూరు లో ర్యాగింగ్ పేరుతో ఒక అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించి ఏడిపించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వాళ్ళను శిక్షించకుండా కేవలం కులం చూసి వారిని వదిలేసిన ప్రభుత్వాన్ని చూసి మాకెందుకు లే అన్యాయమైపోయింది నా కూతురు కాదులే ఎవరో కని అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఆడపిల్లలే మాకెందుకు లే అని ఊరుకుందామా లేక ఆడ పిల్ల ఎప్పటికి మహాలక్ష్మే. అలాంటి ఆడబిడ్డను వేధించే పాలకులను తన్ని తరిమి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసినా కనుగుడ్డు పెరికేసే జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామా ?కౌరవులు ద్రౌపతిని చెరబట్టినట్టు, రావణుడు సీతను అపహరించినట్టు మహిళల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ పచ్చ చొక్కాలను చూస్తూ కూడా మనకెందుకులే అని ఊరుకుందామా లేక సీతను అపహరించిన రావణుడి పది తలలను తెగ నరికిన రాముడిలా, ద్రౌపతిని చెర బట్టిన కౌరవులను అంతం చేసిన కృష్ణార్జుల లా యాసిడ్ దాడి చేసిన వాళ్ళను నడి రోడ్డు మీద కాల్చి చంపిన వై ఎస్ ఆర్ లాగే , ఆడ బిడ్డ మీద కన్ను పడినా వాడి కను గుడ్డు పీకేసి మహిళలకు తోబుట్టువుగా వుండే జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామా ?ఎవరో రైతు అంట వ్యవసాయం చేస్తుంటాడు అంట, ఋణమాఫీ అనే మోసపు మాటలు నమ్మి, బ్యాంకులో తీసుకున్న రుణం కట్టలేదని బ్యాంకు వారు తన ఆస్తిని వేలం వేశారంట దాంతో మనస్తాపం చెంది ఉరేసుకుని చనిపోయాడంట. ఎవరో రైతు అంట పంటలు పండిస్తాడు అంట ఈ దుర్మార్గపు పాలనలో ఇన్పుట్ సబ్సిడీ లేక పెట్టుబడులు పెరిగిపోయి దానికి తగ్గ మద్దతు ధర రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు అంట పంట పండించాల్సిన ఆ రైతు కుటుంబం రోడ్డున పడింది అంట అయినా చనిపోయింది ఎవరో రైతు గా మన ఇంట్లో మనిషి కాదు గా మన బంధువు కాదు గా మనకెందుకు అని ఊరుకుందామా లేక దేశానికి అన్నం పెట్టే రైతు మన ఇంట్లో వాడు కాకపోయినా మన వీధిలో వ్యక్తి కాకపోయినా మన ఊరి వాడు కాకపోయినా రైతు అనే వాడు ఎక్కడున్నా నా వాడే నా ఇంట్లో మనిషే అటువంటి రైతు లేకపోతే నా నోట్లో కి నాలుగు వ్రేళ్లు పోవు కడుపు నింపుకోడానికి ముద్ద దొరకదు అని అనుకుంటూ రైతును రాజుగా చేసి రామ రాజ్యాన్ని తలపించే రాజన్న రాజ్యాన్ని మీ ముందు సాక్షాత్కరించబోయే జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామా ?
 – Jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *