జనసేవకే జన్మించిన జగన్ అన్నా స్వాగతం అన్నా

జనసేవకే జన్మించిన జగన్ అన్నా స్వాగతం !!
#TeamJaganKosam

వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఒక ప్రభంజనం, ఆంధ్ర రాష్ట్రం లో కోటానుకోట్ల మంది ఈ పేరు వింటే పూనకం వచ్చినోళ్ల మాదిరి మా జగన్ మా జగన్ అన్న అని ఊగిపోతారు.

2009 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ లో ఉన్న యువ కెరటం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు. పులివెందుల లో వృద్ధా ఆశ్రమం, వెంకటప్ప స్కూల్, అంగవైకల్యం ఉన్న పిల్లలకు ప్రత్యేక పాఠశాల, టైలరింగ్ లాంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి పులివెందుల ప్రాంత ప్రజలకు నిత్యసేవ చేసిన యువకిశోరం జగన్ రెడ్డి !!

వైయస్సాఆర్ జిల్లా లో పరిశ్రమలు స్థాపించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల మోములో చిరునవ్వులు పూయించిన గొప్ప పారిశ్రామిక వేత్త, పుట్టిన గడ్డకు ఎంత చేసినా తక్కువే అని నమ్మే పెద్దాయన వైయస్సాఆర్ గారి పుత్రరత్నం జగన్ రెడ్డి !!

ప్రజలకు ఇంకా సేవ చేయాలనే కల్మషం లేని మనస్సు తో రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది దుష్ట చేష్టల వల్ల తండ్రి దూరమయ్యి పుటడు దుఃఖం లో కూడా మా నాన్న కుటుంభం దగ్గరే నేను అని ప్రజల్లో ఉన్నందుకు కొంతమంది కళ్ళుపోడుచుకుని అక్రమంగా భందించినా ప్రజాసేవ, ఇచ్చిన మాటకోసం పట్టువిడవని విక్రమార్కుడు, ప్రజా సంక్షేమ పథకాలను కాలరాస్తున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కత్తి దూసి పోరాటం చేసిన పోరాట యోధుడు జగన్ రెడ్డి !!
#TeamJaganKosam
కారాగారం లో ఉన్నా కూడా తన నాన్న కుటుంభం లాంటి తెలుగునేల విడిపోతుంటే చలించి నిరాహారదీక్షకు దిగి తెలుగునేల కోసం ప్రాణాలే పణం గా పెట్టి పోరాడి ఓడిన ప్రజా నాయకుడు. ఓడినా కూడా ప్రజలే న ఆస్తి, నాన్న కుటుంబమే నా కుటుంబం అని వాళ్లకు అండగా ఉంటూ గత మూడేళ్ళుగా వాళ్ళకోసం ప్రభుత్వాల పై కురుక్షేత్ర యుద్ధం లాంటి పోరాటం చేస్తున్న ధర్మరాజు జగన్ రెడ్డి !!

నాన్న కుటుంబం లో భాగమైన ఈ రాయలేలిన సీమ, రెడ్డి రాజ్యం, కళింగ దేశం, శాతవాహన రాజులు ఏలిన ప్రాంత ప్రజలు ఈ దుష్ట పరిపాలన లో ప్రజలు నిత్య కష్టాలు పడుతున్నారని వారి కస్టాలు తెలుసుకునేందుకు కాలినడకన ప్రజా సంక్షేమం అనే సంకల్పం తో రాయలలేలిన సీమ రాయలసీమ లో ఇడుపులపాయ నుండి కళింగదేశం వరకు బయలుదేరిన బాటసారి జగన్మోహనుడు!!

దారిపొడుగునా ప్రజలతో మమేకం అయ్యి వారిలో ఒకడిగా సాగుతున్న పాదయాత్ర లో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చి మీ పరిపాలన రాజన్న పరిపాలన లో మీ కష్టాలను పారద్రోలుకుందాం ని వారి కన్నీరు తుడిచి వడివడిగా సాగుతున్న బాటసారికి అండగా ఉందాం జనం మెచ్చిన పాలన రాజన్న పాలన తెచ్చుకుందాం. అందుకు మనమందరం నిప్పుకణికలై అదరక బెదరక జగన్ అన్నకు తోడుగా అండగా ఉందాం !!
#TeamJaganKosam
ఆయనైతేనే ప్రజా పరిపాలన చేసి ప్రజల సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కలిపి ప్రజారంజక పాలన చేయగల ధీరుడు. అందుకే మనందరి నినాదం జగన్నినాదం, మన మాట బాట జగనన్న బాటలోనే, రాజన్న రాజ్యం కోసం !!

జోహార్ వైయస్సాఆర్ !!
#RavaliJagan #kavaliJagan #PrajaSankalpaYatra #TeamJaganKosam

– పవన్ వంకిరెడ్డి , జగన్ కోసం టీమ్.

మా మెయిల్ ఐడి jagankosam.com@gmail.com

Share this: