W/o వై ఎస్ జగన్

W/o వై ఎస్ జగన్

W/o వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, అత్యంత శక్తివంతమైన మహిల. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండడంతో ఇటు వారి సంస్థలను, వ్యాపారాలను కుటుంభాన్ని, పిల్లల బాధ్యతను మరో వైపు పార్టీని దిగ్విజయంగా నడిపిస్తూ ముందడుగు వేస్తున్న వై ఎస్ భారతి రెడ్డి .  అక్రమ కేసులు బనాయించి బర్తను నిర్భందించినా అశోక వనములో సీతలా సోకించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ నేటి తరం మహిళా లోకానికి మార్గదర్శకం అయింది .ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు బాధలో వున్న కుటుంభాన్ని విడదీస్తూ కేసులలో ఇరికించి ఆత్మవిశ్వాసం ను దెబ్బ కొట్టాలని న్యాయాన్ని ధర్మాన్ని బూటు కాలు కింద వేసి నలుపుతూ వ్యవస్థలన్నీటిని  ఏకధాటిగా వాడుతూ తన భర్తను అక్రమంగా 16 నెలల పాటు నిర్భందించి తన భర్తను కుటుంభానికి దూరం చెయ్యాలనే క్రూర ఆలోచనలను తిప్పికొట్టడానికి ఒక వైపు బాధను దిగమింగుకొని గుండెను రాయి చేసుకుంటూ న్యాయం కోసం ధర్మం కోసం అక్రమ మార్గంలో నడుస్తున్న వ్యవస్థలతో పోరాడిన కలియుగ పార్వతి దేవి వై ఎస్ భారతి రెడ్డి.

ఓ వైపు మీడియా రంగంలో మరో వైపు సిమెంట్ రంగంలో ఎంతో పోటీని ఎదుర్కుంటూ మొదటి స్థానంలో నిలబెట్టి వేలాది మందికి ఉపాధి కలిగించిన మాతృమూర్తి. కోట్లాది తెలుగు ప్రజల కష్టాలను బాధ్యతలను తన బుజ స్కందాల మీద మోస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు ఆశాకిరణం అయిన జగన్మోహన్ రెడ్డి గారి అర్ధాంగి, దేవుడు రాసిన పేదోడి తల రాతను తిరిగి రాసి తన సంక్షేమ పధకాలతో 9 కోట్ల మంది తెలుగు వారి గుండెల్లో దేవుడల్లే గూడు కట్టుకున్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కోడలు, సంపాదన కోసమే వైద్యం అనే నేటి సమాజంలో కూడా కేవలం రెండు రూపాయలకే వైద్యం చేస్తూ ఎలాంటి జబ్బునైన కేవలం చేతి స్పర్శతో బాగు చేస్తున్న వైద్యులు గంగిరెడ్డి గారి ముద్దుల కూతురు, పసి వయసులో ఒత్తిడిలను తట్టుకొని ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించిన చదువుల తల్లికి జన్మనిచ్చిన వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వై ఎస్ భారతి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.