వై ఎస్ జగన్ మనసులో మాట

” పాదయాత్ర చెయ్యాలి అనే నా నిర్ణయం ఎన్నో భాగోద్వేగాలతో కూడుకున్నది, చిన్నప్పటి నుండి ఇంట్లో నాన్నను తాతను కలవడానికి ఎంతో మంది ప్రజలు వచ్చే వారు, అలాగే 1999 ఎన్నికలకు అప్పటికే ఒకసారి జిల్లా ఇంచార్జ్ గా చేసిన అనుభవం వుండడం, ఆ తర్వాత 2003 లో కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న కడప ప్రజలలో మంచిరోజులు రాబోతున్నాయి అని ఆత్మ స్థైర్యం నింపడానికి నాడు నేను చేసిన పాదయాత్ర ప్రత్యేకంగా నాకు ప్రజల కష్టాలను మరింత దగ్గరాగా చూసే అవకాశం కల్పించింది. ఆ మండుటెండలో నడుస్తున్నప్పుడు కాళ్ళు బొబ్బలెక్కి ఒకానొక సమయంలో నడవలేని పరిస్థితి ఏర్పడింది, ఇంట్లో వాళ్ళు పాదాలు చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా నాకు ఇంకా గుర్తుంది. కాని ప్రజలకు ధైర్యం చెప్పుకుంటూ కరువుతో అల్లాడుతూ మోడు బారిన వారి జీవితాల్లో ఆశలు చిగురిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మండుటెండలో నేను వ్యక్తిగతంగా పడుతున్న కష్టం నాకు కొంచెం కూడా కనిపించలేదు. ఆ తర్వాత నాన్న ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నప్పుడు అకస్మాత్తుగా నాన్న చనిపోవడం పూర్తిగా జీర్ణించుకోలేని అంశం అయింది.వ్యక్తిగతంగా నా వరకు చెప్పాలంటే కుటుంభం లో ఒక వ్యక్తి పెద్ద దిక్కు, కని పెంచిన తండ్రిని పోగొట్టుకోవడం అనేది తీరని బాధగా జీవితాంతం వేధించే లోటుగానే వుంటుంది కానీ మరో వైపు చూస్తే నాన్న మరణంతో కోట్లాది ప్రజల ఆశలు సమాధి అవ్వడం చూస్తుంటే ఒక్క సారిగా దుఃఖం పొంగుకోచ్చేసింది. ఎన్నో కుటుంబాలు ఒక్క సారిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాయి ఎన్నో కుటుంబాల ధీన గాధలు స్మశాన వైరాగ్యాన్ని తలపించాయి. నా కొడుకును రాజశేఖర్ రెడ్డి చదివిస్తున్నాడు ఇంకో మూడేళ్ళు పోతే ఉద్యోగం వస్తుంది కష్టాలు తీరుతాయి అని ప్రశాంతంగా వున్న ఎన్నో కుటుంబాలలో నాన్న మరణంతో వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఏ క్షణం ఏమి జరుగుతుందో తమ తలరాతను ఆ దేవుడు ఎలా రాసాడో ఎప్పుడు ఏ జబ్బు తమ జీవితాలను కబలిస్తుందో అనే భయాలు లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా మా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చూసుకుంటారు లే అనే భరోసాతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న పేదవారి బ్రతుకులు నాన్న మరణంతో ఒక్క సారిగా ఆగిపోయాయి.

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ధీన గాధలు ఫీజ్ మాఫీ మీద ఆధారపడిన వారు అవ్వచ్చు లేకుంటే ఆరోగ్యశ్రీ తో తమ జీవితాలను పదిలం చేసుకున్న వారు అవ్వచ్చు లేకుంటే పావలా వడ్డీ మీద ఆధారపడిన డ్వాక్రా అక్కచెల్లమ్మలు అవ్వచ్చు ఫించన్ మీద ఆధారపడిన అవ్వతాతలు అవ్వచ్చు రైతులు అవ్వచ్చు నాలుగు రోజులు సూర్య చంద్రులు ఇద్దరూ కనపడకపోయినా తమ జీవితాలను ఢోకా లేకుండా సాగించే సత్తా వున్న వీరి జీవితాలు నాన్న మరణంతో ఒక్క సారిగా ఆగిపోయ్యాయి. మరోవైపు నాన్న మరణవార్త విని గుండె పగిలిన వారు కొందరైతే నాన్న మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణత్యాగం చేసిన వారు మరికొందరు, ఇంట్లో మనిషిని పోగొట్టుకోవడం అనేది ఎంత వేదన కలిగిస్తుందో నాకు తెల్సు ఎందుకంటే అప్పటికే ఆ బాధను నేను భరిస్తున్నాను.

ఇన్ని రోజులు నాన్నకు నాకు మా కుటుంబానికి అండగా వుండి ఈ రోజు అనాధలయిన ప్రతి కుటుంబాన్ని కలవాలి కలిసి అండగా వుండాలి మనం అంతా ఒకే కుటుంబం అని ధైర్యం చెప్పాలి అలాగే స్తబ్దుగా వున్న రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కలిగించాలి అని ఓదార్పు యాత్రగా ప్రజలతో మమేకం అయ్యాను. తర్వాత ప్రజల నుండి నన్ను దూరం చెయ్యడానికి ఎన్ని కుట్రలు పన్నారు అనే విషయం అప్రస్తుతం. ఇలా ప్రజా జీవితం అనేది నాకేమి కొత్తకాకపోయినా పాదయాత్ర కు ముందు నన్ను నేను మానసికంగా శారీరకంగా సంసిద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వున్నా క్లిష్ట పరిస్థితి తలచుకుంటే నాకు ఇది పెద్ద కష్టమని అనిపించలేదు .

నాన్న 54 సంవత్సరాల వయసులో మండుటెండలో పాదయాత్ర చేయ్యడం అనేది చెప్పాలంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. అప్పటి పరిస్థితులు కూడా అంతే దారుణంగా ఉండేవి . వరుసగా తొమ్మిది సంవత్సరాలు కటిక కరువు ఓ వైపు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ త్రాగు నీరు సాగు నీరు సమృద్ధిగా లేదు అలాంటి స్థితిలో రాష్ట్ర ప్రజలు తమ మనుగడకోసం తమ తలరాతతో యుద్ధం చేస్తుంటే అవేమి పట్టనట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ కరెంట్ చార్జీల పేరిట పన్నుల పేరిట ప్రజల మీద అధిక భారం మోపుతో ఆ ప్రజా సొమ్ముతో పాలకులు విలాసాలను అనుభవించేవారు. అప్పటివరకు తమ జీవితాలు సాఫీగా సాగడానికి సాయం చేసిన పంచభూతాలు ఒక్క సారిగా వికృతంగా మారాయి, రైతుకు సహకరించడం మానేశాయి. పంట సాగుకు నీరు లేక అప్పుల బాధలు తట్టుకోలేక ప్రభుత్వ అవమానాలు భరించలేక రాజ్యానికి అన్నం పెట్టాల్సిన రైతులు ఆత్మహత్య బాట పట్టారు. అప్పుడు దేశంలో జరుగుతున్న ప్రతి నాలుగు రైతు ఆత్మహత్యలలో మూడు రైతు ఆత్మ హత్యలు ఆంధ్రప్రదేశ్ నుండే జరిగాయి అంటే అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి భయానక పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న వారికి బరోసా కలిగించడానికి పంచభూతాలను సైతం ఎదుర్కుంటూ అప్పుడు నాన్న పాదయాత్ర చేసారు. దాదాపు 1500 కిలోమీటర్లు నడుస్తూ దారిపొడవునా కనపడిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తున్నాయి అనే భరోసా కలిగించడంలో నాన్న విజయం సాధించాడు.

పాప పాదయాత్ర చేసినప్పుడు మన రాష్ట్రంలో ఒక విభిన్న పరిస్థితి ఉన్నింది. ప్రజల నన్ను దూరం చెయ్యాలనే పాలకుల కుట్రలు ఫలించి నన్ను నిర్బంధించారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కలసిపోయ్యి ప్రజలను పీడించాయి. ఎక్కడైనా ప్రతిపక్షం అనేది ప్రజల పక్షం వుంటుంది. అధికారపక్షం పన్నుల రూపంలో కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలమీద అధికభారం మోపుతుంటే ప్రబుత్వం మీద పోరాడాల్సిన ప్రతిపక్షం ప్రబుత్వం తో చేతులు కలిపేసింది. కుట్రలు కుతుంత్రాలా నుండి ప్రజల మధ్యలోకి రాలేని పరిస్థితి నాది, ఇన్నేళ్ళుగా మా కుటుంబానికి అండగా వున్న ప్రజలు కష్టాలు పడుతుంటే వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మా పైన వుంది అందుకే షర్మిల పాదయాత్ర చెయ్యాల్సి వచ్చింది. దాదాపు 3000 కిలోమీటర్లు పాప పాదయాత్ర చెయ్యడం అనేది అధ్బుతం. చెల్లి ఓ వైపు పాదయాత్ర చేస్తూ మరోవైపు నాన్న ఏదైతే రచ్చబండ అని మొదలు పెట్టి మన మధ్య నుండి దూరమయ్యారో అదే రచ్చబండను ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయుధంగా చెల్లి ఉపయోగించడం చాలా గొప్ప విషయం. కొన్ని గ్రామాలలో రచ్చబండ నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించి మీకు అండగా మేమున్నాం వైఎస్ కుటుంబం ఎల్లప్పుడూ మీ కోసం మీకు మంచి రోజులు తీసుకురావడం కోసమే పోరాడుతూ వుంటుంది అని చెల్లి ప్రజలలో భరోసా కలిగించింది .

ఇక నా పాదయాత్ర విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకందరికీ బాగా తెల్సు, ఈ అన్యాయపు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారి బరితెగించింది అంటే చివరికి మహిళల మీద తమ ప్రతాపం చూపిస్తుంది, అధికారుల అధికారాలని సైతం పచ్చ చొక్కాల మయం చేసి ప్రభుత్వం వికృత క్రీడ ఆడుతుంది. ఎటువంటి ఆసరా లేని వారికి ఇచ్చే ఫించన్ కూడా అర్హులకు అందడం లేదు. రైతులకు బ్యాంకుల నుండి రుణాలు అందడం లేదు ప్రభుత్వం నుండి ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదు అప్పు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలవైపు చూస్తుంది రైతాంగం. పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ప్రబుత్వం కర్చుపెడుతున్నాం అని చెప్పుకుంటున్నదంతా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యింది తప్ప   నేటి బాలలే రేపటి పౌరులు అంటూ బాలలను బడికి పంపలేక పోతుంది. అక్కచేల్లమ్మల్లకు కానీస బద్రత లేదు చదువులు నేర్పించాల్సిన విద్యాలయాలు వారి పాలిట శాపాలుగా తాయారు అయ్యాయి. మూడు పంటలు పండే పంటపొలాలను రాజదాని పేరిట బలవంతంగా తీసుకొని ఇంతవరకూ పునాది కూడా వెయ్యకుండా దేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తుంది ప్రబుత్వం .ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ ఆగిపొయ్యాయి, నేలరాలిన వర్షపు చినుకులు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తా వున్నాయి . పిల్లలు రైతులు మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రబుత్వం మాత్రం అబద్ధాలు చెప్తూ ప్రజలను  మబ్య పెడుతుంది . ప్రజలు దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులకు మూలాలు  ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించకుండా హెలికాఫ్టర్ అంబులెన్స్ లు ఇస్తాము ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తాము అంటూ హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది పార్టీలు ఆలోచించుకోవాలి. ప్రబుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఏ రైతు రుణాల కోసం బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అటువంటి మూలాలను చూసి వాటిని పరిష్కరించడం ప్రబుత్వాల కానీస బాధ్యత . మీడియా ను అడ్డు పెట్టుకొని ప్రబుత్వం ప్రజలకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తుంది . ప్రజాస్వామ్యం అంటే ప్రజలకొరకు ప్రజలచేత ప్రజలే పరిపాలించడం అలాంటపుడు మన పరిపాలన కూడా ప్రజల మధ్యనుండి  సాగించాలి . ఇన్నేళ్ళలో పేదరికాన్ని నేను చూసినంత  దగ్గరగా మరెవరూ చూసివుండరు కాని  ప్రజలకు నాకు మధ్య దూరం ఉండకూడదు అని నేను వారిలో ఒకడిని అయ్యి వారి మధ్య నుంచే వారిచేతనే  మ్యానిఫెస్టో రెడి చెయ్యాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నా.  కలియుగంలో దుష్టులకు శక్తి ఎక్కువ మంచివారికి శక్తి తక్కువ అంటుంటారు అలాంటి దుష్టులమీద పోరాటం చేస్తున్నప్పుడు మనం మరింత కష్టపడాలి.  అప్పుడు నాన్న అయినా ఇప్పుడు నేను అయినా కలియుగ వెంకటేశ్వరుడి ఆసిస్సులతోనే పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నాం . నీతి నిజాయితీలతో ధర్మంగా మనం చేసే పోరాటానికి ఆ కలియుగ వేంకటేశ్వరుడు తోడుంటాడు అనే నమ్మకంతో తొలి అడుగు వేస్తున్నా. మీలో ఒకడిగా మీతో పాటుగా మీతోనే వుంటా మీ మధ్యే ఉంటా, నేను వేసే ప్రతి అడుగు తెలుగు ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికేలా వుంటుంది . – వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

 

రాముడు ధశరధ వంశ ప్రతిష్టను నిలబెట్టి నట్టు నేటి తరానికి ఆదర్శంగా వైఎస్సార్ ప్రతిష్టను జగన్ అన్న ఇనుమడింప చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము జగన్ అన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *