జగన్ చెప్పే టైం థియరీ


బహుశా సమయం విలువ జగన్ కు తెలిసినంత మరెవరికి తెలియదనుకుంటా చిన్నప్పటి నుండి ప్రతి క్షణం ప్రజల కోసమే అన్నట్టు సాగిన జగన్ సమయానికి ఇచ్చే విలువ ఏంటి జగన్ చెప్పే టైం థియరీ ఏంటి అనేది జగన్ గారి చిన్న నాటి స్నేహితుల మాటల్లో తెలుసుకుందాం …..జీవితమంటే కొన్ని కోట్ల క్షణాల మయం . మిలియన్ల కొద్ది సెకన్లు కలిస్తే ఒక జీవితం. ప్రతి క్షణమూ అమూల్యమే. జీవితపు విలువ తెలిసిన వారెవరూ సమయాన్ని వృధా చేయరు . కాలం విలువ తెలిసిన వ్యక్తి జగన్. సమయాన్ని అమూల్యమైనది గా భావిస్తారు , సమయానికి సంబంధించి ముఖ్యంగా ఆయన ఒక మాట అంటారు అది ఏంటి అంటే ప్రపంచంలో ఏ పని చేయకుండా బ్రతికే సోమరికి, అలాగే నిరంతరం పని చేసే ఒక మేధావికి ఇద్దరికి కూడా రోజుకు 24 గంటలే ఉంటాయి, ఆ దేవుడు సమయాన్ని అందరికి ఒకేలా ఇచ్చాడు, అమెరికా అధ్యక్షుడికి ఏమి గంటకు 200 నిమిషాలు ఉండవు అలా అని ఏమి సాధించని వాడికి గంటకు 20 నిమిషాలు మాత్రమే ఉండవు, జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వాడికైనా అధమ స్థాయిలో వున్న వాడికైనా సమయం ఒక్కటే , సమయాన్ని సద్వినియోగం చేసుకొనేవాళ్ళు శిఖరాల్లో వుంటారు, సద్వినియోగం చేసుకొని వాళ్ళు అగాధం లో వుంటారు అని అనే వారు . సమయాన్ని వృధా చేసే వాళ్ళు అంటే జగన్ కు చాలా కోపం. కొంత మంది కొంత కాలం కష్టపడి పని చేస్తారు , సరైన ఫలితం లేకుంటే రాకుంటే వెంటనే కష్టపడడం మానేస్తారు మానేసి తమకు కాలం కలిసి రావడం లేదని నిరాశలో మునిగి తేలుతూ వుంటారు . ఇలాంటి వాటికి జగన్ ఒకటే హితువు చెబుతారు అది ఏంటి అంటే , ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికి అయినా కాలం ఒక్క రీతిలో ఉండదు మంచి కాలం , కష్టకాలం ఈ రెండూ ప్రతి మనిషి జీవితంలో మాములే , కాలం మనకు అనుకూలంగా వున్నా , ప్రతికూలంగా వున్నా మనం కష్టపడడం మానకూడదు , నిరంతరం హార్డ్ వర్క్ చేస్తూ వుండాలి , హార్డ్ వర్క్ చేసేవాళ్లకు కాలం దానంతట అదే కలసి వస్తుంది. మంచి కాలం వచ్చినప్పుడు, గతంలో చేసిన శ్రమ , ప్రణాళిక ఇవన్నీ కలిసి మంచి ఫలితాలను ఇస్తాయి. మంచి కాలం వచ్చేవరకు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొనే వాడు మూర్ఖుడు అని అంటుంటారు జగన్.

జగన్ చిన్నప్పటి నుండి ఒక మాట అనేవారు అది ఏంటి అంటే ” ఇంతటితో నా పని అయిపోయింది అని ఎవరూ ఎప్పుడూ అనుకోకూడదు , పగలు రాత్రి , చీకటి వెలుగు లాగే ఒక్కొక్క సారి కాలం ప్రతికూలమవుతుంది పడిన వాడు మళ్ళీ లేస్తాడు. బంతిని ఎంత వేగంగా నెలకు కొడితే అంత వేగంగా పైకి లేస్తుంది నిన్నటి గురించి ఆలోచించవద్దు రేపటి గురించి బయపడకు , మన ప్రయత్నం మాత్రం మరచిపోకూడదు అని అనేవారు .
జగన్ ఒక శ్రమ జీవి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నేర్పరి. ఆయన అతి తక్కువ గంటలు నిద్రపోతారు, ఎప్పుడూ ఉత్సాహంగా వుంటారు. మన వల్ల పదిమంది సంతోషం పొందుతున్నప్పుడు వారిలోని ఆనందమే మనలో ఉత్సాహాన్ని నింపుతుంది అని అంటారు .

( జగన్మోహన్ రెడ్డి గారి బాల్య మిత్రుడు అయిన జె. జగన్ రెడ్డి గారు 2008 లో చెప్పిన విషయాలు ఇవి )

( జగన్ గారి వ్యక్తిత్వం చిన్నతనంలో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యి ప్రజల మధ్య వుండి ప్రజల కోసం పని చెయ్యాలనే ఆయన ధృడ సంకల్పాన్ని జగన్ గారి అభిమానులకు అందరికి అందించాలనే ఉద్దేశంతో జగన్ కోసం టీం చేస్తున్న చిరు ప్రయత్నం )
జగన్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు మాతో పంచుకోవాలంటే దయచేసి మాతో సంప్రదించండి మా మెయిల్ ఐడి jagankosam.com@gmail.com

1 thought on “జగన్ చెప్పే టైం థియరీ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *