జగన్ పెద్దలను గౌరవించడు అని ఎవడైనా వాగితే చెప్పుతో కొట్టండి

జగన్ పెద్దలను గౌరవించడు అని ఎవడైనా వాగితే చెప్పుతో కొట్టండి. జగన్ గారు రాజీనామా చేసిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ఓ వర్గం బజన మీడియా జగన్ గారిని ఉద్దేశించి జగన్ పెద్దలను గౌరవించడు, జగన్ పెద్దలను చులకనగా మాట్లాడుతాడు అని అంటున్నారు. అలాగే మీడియా ప్రతినిదులమని చెప్పుకొనే మరి కొందరు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నాయకులను ఇంటర్వ్యూ చేసిన ప్రతి సారి జగన్ పెద్దలను గౌరవించడు కదా మీరు ఆ పార్టీలో ఎలా కోనసాగుతున్నారు? జగన్ పార్టీలో మీకు తగిన ప్రాధాన్యత దక్కుతా వుందా ? జగన్ వైఖరి నచ్చకనే అందరూ పార్టిలు మారుతున్నారు కదా? అని విషపు ప్రశ్నలు అడుగుతున్నారు …..ఇక్కడ కొన్ని ఉదాహరణలు :-

వివిధ సందర్బాలలో జగన్ గారి గురించి అన్ని పార్టీల వారు మాట్లాడిన మాటలు

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ( ఎమ్మెల్సి )

ప్రాధాన్యం దక్కడం ఏంటి? జగన్ ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు . ఇక తీసుకొనే నిర్ణయాలు ఏక పక్షంగా తిసుకుంటారా లేక అందరిని సంప్రదిస్తారా అంటే ఎస్ అందరిని సంప్రదిస్తాడు . ఏదైనా నిర్ణయం తిసుకోనేటపుడు అందరిని కూర్చో బెట్టి మాట్లాడాకే నిర్ణయం తీసుకుంటాడు, మొన్న 2014 ఎన్నికలప్పుడు ఇలాగే అందరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందరం ఋణ మాఫీ ప్రకటించమని అడిగాము దానికి జగన్ మాట్లాడుతూ లేదు నేను అన్ని లెక్కలు వేసుకున్నాను అన్నా, రాష్ట్రము విడిపోయిన తర్వాత మన రెవిన్యూ ఏంటి కర్చులు ఏంటి ఆదాయం ఎంత అని అన్ని లెక్కలు వేసుకున్నా అన్నా కాబట్టి ఈ బడ్జెట్ తో మనం ఋణ మాఫీ చెయ్యలేము చెయ్యలేని హామీలు ఇచ్చి జనాలను మోసం చెయ్యలేము అని అన్నాడు. ఒక రకంగా జగన్ మాటలు విని నేను సంతోషించాను, ఎందుకంటే అందరు రాజకీయ నాయకులూ లాగా అధికారం కోసం దొంగ హామీలు ఇచ్చి జనాలను మోసం చెయ్యాలనే ఆలోచన జగన్ కు లేనందుకు నేను చాలా సంతోషించాను . నేనా ఇంకొకరా అని కాదు జగన్ ప్రతి విషయాన్నీ స్టడి చేస్తారు కొన్ని లెక్కలు అయన వేసినట్టు మేము ఇంత అనుభవం వుంది కూడా వెయ్యలేము. మన రాష్ట్రంలో వున్న నదులు వాటిలో వున్న నిరు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లాంటి లెక్కలు జగన్ చెప్పినట్టు ఇంక ఎవరూ చెప్పలేరు. ఇవాల్టికి కూడా జనాల కోసం ప్రత్యేక హోదా కోసం జగన్ చేసినన్ని పోరాటాలు ఎవ్వరూ చెయ్యలేదు. ఆ రోజు కూడా నేను పదవి వద్దని చెప్పినా జగనే లేదు అన్నా మీరు కౌన్సిల్ లో వుంటే బాగుంటుంది అని చెప్పి పదవి నాకు ఎమ్మెల్సి ఇచ్చారు .

విశ్వేశ్వర్ రెడ్డి ( ఉరవకొండ ఎమ్మెల్యే , వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ )

బయట చేస్తుంది అంతా దొంగ ప్రచారమే జగన్ ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. వయసులో పెద్ద వాళ్ళను అందరిని అన్నా అని పిలుస్తాడు. మేము కూడా మా పార్టి అధ్యక్షున్ని పేరు పెట్టి పిలవడం తప్పు కదా ? వయసులో చిన్న వాడు అయినంత మాత్రాన రేపు పొద్దున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే జగన్ అని పిలవడం తప్పు కదా ?. ఒక నొక సమయంలో ఎన్నికల ప్రచారానికి నేను పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి జగన్ ముగ్గురు కార్ లో తిరుపతి వెళ్తున్నాము. అప్పుడు నేను జగన్ తో ఋణ మాఫీ ప్రకటిద్దాం అని అడిగాను అందుకు జగన్ ఒకే మాట అడిగారు , అబద్ధం చెప్పమంటారా విశ్వా అన్నా ? మనం చెయ్యలేము , చెయ్యలేము అని తెల్సినా అబద్ధం చెప్పి మోసం చేయ్యమంటారేమో చెప్పండి చెప్తాను కావాలంటే డ్వాక్రా వరకు చేద్దాం అన్నా అని అన్నారు .

భూమా నాగి రెడ్డి ( జగన్ పేరుతో గెలిచి టిడిపి లో చేరిన ఎమ్మెల్యే ) :-

బయట చెప్తుంది అంతా తప్పు అండి, ప్రతి ఒక్కరిని జగన్ అప్యాంగా అన్నా అని పలకరిస్తాడు. ఒక కుటుంభ సబ్యుడిలా మాట్లాడుతాడు . జగన్ పార్టీలో ఉన్నంత ఫ్రీడం ఇంకా ఏ పార్టీలో ఉండదు . నేను కూడా ఒక ప్రాంతీయ పార్టి నుండి వచ్చిన వాడినే గా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెల్సు, కానీ జగన్ దగ్గర ఉన్నంత స్వేచ్చ వేరే దగ్గర ఉండదు .

కొమ్మినేని శ్రీనివాస్ రావు ( జర్నలిస్ట్ )

నా ఉద్యోగం పోయింది అని తెల్సిన వెంటనే జగన్ గారు కబురు పంపారు . వెళ్ళంగానే మీకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాను అన్నా అన్నాడు, ఆ తర్వాత సాక్షిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఆయన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలని వేరే వాళ్ళ ద్వారా అప్పాయింట్మెంట్ అడిగాను, దానికి అయన అన్న మన దగ్గర వున్నాడు అన్న మన మనిషి ఎప్పుడు కావాలన్నా కలవచ్చు ఈ ఫార్మాలటీస్ అన్ని ఎందుకు అని అన్నాడు, అయన దగ్గర జీతం తీసుకొని పని చేసే వాళ్ళను కూడా అన్నా అని పిలవడం ఆయనకే చెల్లింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ నాడు నీకు ఎటువంటి సాయం అయినా చేస్తాను అన్నా అని చెప్పాడు నేడు జాబ్ ఇచ్చి నా జీవితాన్ని నిలబెట్టాడు . వై ఎస్ ఆర్ గారికి మాట తప్పడు మడమ తిప్పడు అని వై ఎస్ ఆర్ కు పేరు వుంది అలాగే జగన్ గారు కూడా ఇచ్చిన మాట తప్పడు .

జేసి ప్రభాకర్ రెడ్డి ( తెలుగు దేశం ఎమ్మెల్యే )

అలాంటిది ఏమి లేదు, ఈ రోజు కూడా నేను ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే మొదట జగనే బాగున్నావా అన్నా అని పలకరిస్తాడు …..

ఉండవల్లి అరుణ్ కుమార్ ( కాంగ్రెస్స్ ఎంపి )

గౌరవించడు అని బయట మాట్లాడే మాటలు అన్ని వేస్ట్ అండి. మొన్న మా అమ్మ గారు చనిపోయినప్పుడు కాల్ చేసి పలకరించాడు ఆ తర్వాత మా ఇంటికి కూడా వచ్చాడు , అందరితో ఆప్యాయంగా మాట్లాడాడు ఓపికగా …..

నా సొంత అనుభవం :-

ఎన్నికల సమయంలో పార్టిలోని ఇద్దరు ముఖ్యులతో మంచి అనుబంధం ఏర్పడింది. వారి పేర్లు ఇక్కడ అనవసరం కాని ఒకానొక సంధర్బంలో అంతక ముందు ఎన్టివి లో వచ్చిన ఒక ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ “ ఏంటి సర్ అన్ని చానల్స్ లో ఇలా వేస్తున్నారు అని అడిగితే దానికి అయన “ నువ్వు కూడా ఇలాంటివి చూసి నన్ను అడుగుతున్నావా ? నేను జగన్ దగ్గర సాక్షి లో జీతం తీసుకుంటున్నా కాని వయసులో పెద్దోడిని అని నన్నే అన్నా అని పిలుస్తున్నాడు అలాంటిది వై ఎస్ ఆర్ గారితో సన్నిహితంగా వున్న వాళ్ళని అయన గౌరవించకుండా ఉంటాడా ? జీతం తీసుకొనే వాడిని కూడా అన్నా అని ఆప్యాయంగా పిలవడం నువ్వు ఎక్కడైనా చూసావా ? “ అని అడిగారు .

ఇవి కేవలము కొన్ని ఉదాహరణలు మాత్రమే, ఇది జగన్ గారి క్యారెక్టర్ , ఇది జగన్ గారు పాటించే విలువలు ఇవి తెల్సుకోకుండా ఒక వర్గం జాతి మీడియా విష ప్రచారం చేస్తా వుంది అలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టండి …..

 

– యశ్వంత్ రెడ్డి ( jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *