మై మై సన్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ నాట్ లైక్ దట్ – 1999 లో వై ఎస్ జయమ్మ ఇంటర్వ్యూ

1999 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారి తల్లి వై ఎస్ జయమ్మ గారిని ఇంటర్వ్యూ చేశారు. వై ఎస్ జయమ్మ గారు ఆ కాలంలోనే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. రాజారెడ్డి హత్య నుండీ ఆ కుటుంభం ఇంకా కొలుకోలేదు.
ఇంటి లోనికి వెళ్ళగానే నాకు ఆశ్చర్యం వేసింది నన్ను ఎవ్వరూ అడ్డుకోలేదు బయట ప్రచారం వున్నట్టు ఫ్యాక్షన్ కుటుంభం అయితే నన్ను మొదట్లోనే అడ్డుకునే వారు కానీ అలాంటి పరిస్థితి కనపడలేదు నేను నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎన్నికల గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్న ఇద్దరి దగ్గరకు వెళ్లి జయమ్మ గారిని కలవాలని చెప్పాను వెంటనే వాళ్ళు నన్ను డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన జయమ్మ గారు ఇంటర్వ్యూ కు ఒప్పుకొని వెంటనే కిచెన్ లోకి వెళ్లి స్వయంగా కాఫీ తీసుకొచ్చారు. ఆవిడతో పాటు రూమ్ లోకి వచ్చిన మనవళ్ళు జగన్మోహన్ రెడ్డి అలాగే యువరాజ్ రెడ్డి గారు మా ఛానల్ గురించి జయమ్మ గారికి వివరించారు.పత్రికా ప్రతినిధి : మీ కొడుకు గెలుస్తాడనే అనుకుంటున్నారా ?
జయమ్మ గారు : కచ్చితంగా గెలుస్తాడు ఆ నమ్మకం నాకుంది.పత్రికా ప్రతినిధి : బయట ప్రచారంలో వున్నట్టు మీరు ప్రజలను భయపెట్టి గెలుస్తున్నారా ? మీకు పోటీ నిలబడటానికి కూడా ప్రజలు భయపడుతున్నారు అంట గా ?
జయమ్మ గారు : ( నవ్వుతూ ) నాకెవరు భయపడరు, నేను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను. ( మధ్యలో అప్పటి పులివెందుల ఎన్నికల ఇంచార్జ్ జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని ) మేము ఎవ్వరిని భయబ్రాంతులకు గురి చెయ్యడం లేదు. మాకు ఇక్కడ వాళ్ళు భయపడుతుంటే మా తాతను ఎలా హత్య చేస్తారు ? ఇప్పటికి కూడా ఆయన హత్య జరిగి సంవత్సరం అయినప్పటికీ హత్యకు కారణం అయిన వాళ్ళను జైల్లో పెట్టలేదు. ఇలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని నిందిస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాలు పవర్ లో లేకపోయినప్పటికీ ఇప్పటికి మా నాన్న అంటే స్టేట్ లో అందరికి గౌరవం ఎక్కువ . మా నాన్న చరిష్మా కలిగిన నాయకుడు అందుకే వీళ్ళు అది తట్టుకోలేక చెడు ప్రచారం చేస్తున్నారు.పత్రికా ప్రతినిధి : మరి ప్రజలు ఎందుకు మీ కొడుకును కడప పులి అని అంటున్నారు ?
జయమ్మ గారు : నాకు తెలియదు, ఇక్కడ ప్రజలు నా భర్తను కడప పులి అని అనేవాళ్ళు కానీ నా కొడుకు సౌమ్యుడు. కోపం రావడం కూడా చాలా తక్కువ. నిజాయతీగా ఉంటాడు కోప్పడడం కూడా చాలా తక్కువ.

పత్రికా ప్రతినిధి : మీ కుటుంభం గురించి ?
జయమ్మ గారు : మా మామయ్య యెడుగూరి సందింటి వెంకట రెడ్డి గారు బలపనూరు గ్రామం ఉన్నత స్థితి లో ఉన్న కుటుంబ పెద్ద, మా అత్తా గారు వైయస్ మంగమ్మ గారు. వారి కుమారుడు నా భర్త వైఎస్ రాజా రెడ్డి గారు.

పత్రికా ప్రతినిధి : మీ కుటుంబానికి ఫ్యాక్షన్ తో సంబంధాలు లేవా ?
జయమ్మ గారు : మా కుటుంబానికి ఫ్యాక్షన్ తో ఎటువంటి సంబంధం లేదు, మా కుటుంబంలోని ఎవ్వరూ ఫ్యాక్షన్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు లేవు.
పులివెందుల లో ఉంటూ చుట్టూ 30 గ్రామాల ప్రజల బాగోగులు ఒక పెద్ద మనిషిలా చూసుకుంటూ చిన్న చిన్న గొడవలు కూడా నా భర్త సర్ధుబాటు చేసే వారు.
ఒక సందర్భం లో పులివెందుల కు చెందిన లాయర్ కొండా రెడ్డి నా భర్త కు సంబంధం లేని రాజంపేట బైరటీస్ ఘనుల యజమాని  నరసయ్య హత్య తో సంబంధం ఉందని చెప్పారు దానిని ఆధారంగా చేసుకొని 1980 లో నరసయ్య మేనల్లుడు నా కొడుకు మీద హైదరాబాద్ లో దాడి చేశారు ఆ తర్వాత అది తప్పు అని ఆ హత్యతో నా భర్తకు ఎటువంటి సంబంధం లేదు అని కొండ రెడ్డి లాయర్ చెప్పారు. దానికి సాక్షం కడప లో ఉండే లాయర్ సాంబశివయ్య.  తర్వాత ఆ కేసు లు కోర్ట్ ల ద్వారా పరిష్కరించబడ్డాయి.

( మధ్యలో జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని ) ప్రత్యర్ధులు చెప్తున్నట్టు మా నాన్న రౌడీ గూండా అయితే ఇంతవరకు వరకు ఒక్క కేసు కూడా ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు అండి ? మా నాన్న అధికారంలో కూడా లేడు కదా మరి అలాంటపుడు వారి ఆరోపణలు నిజం అయితే కేస్ ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు ? ( నిజమే ఇంటర్వ్యూ తర్వాత మా సిబ్బంది ఇక్కడ లయర్లను పోలీసులను అడిగి విచారించాము మాకు తెలిసింది ఏంటి అంటే వైఎస్సార్ బాంబ్ కల్చర్ కు చాలా దూరం అని ).

 

మీడియా ప్రతినిధి: మీ పిల్లల గురించి.
జయమ్మ గారు : మాకు 5 మంది కొడుకులు, ఒక కూతురు.
పెద్దకొడుకు జార్జ్ రెడ్డి, రెండో అబ్బాయి రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి, విమలమ్మ, సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి.

మీడియా ప్రతినిధి : మిగిలిన వారి కంటే ముందు సిఎం అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పండి .
జయమ్మ గారు : రాజశేఖర్ రెడ్డి మంచి తెలివైన విద్యార్ధి, బళ్లారిసెయింట్ జాన్స్ స్కూల్, ఇంటర్ విజయవాడ లయోలా, ఎంబిబిఎస్ గుల్బర్గా లోని మెడికల్ కాలేజీ లో 1972 లో పూర్తిచేసి, అదే సంవత్సరం విజయమ్మ తో వివాహం అయింది. తర్వాత తిరుపతి లో హౌస్ సర్జన్ చేసిన తర్వాత జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రి లో రాజారెడ్డి గారి అక్క  డా.రత్నమ్మ పర్యవేక్షణ లో ప్రాక్టీస్ చేసి, పులివెందుల లో సొంత 70 పడకల ఆసుపత్రి నడిపాడు. అప్పట్లో రూపాయి డాక్టర్ గా జమ్మలమడుగు, పులివెందుల లో మంచి పేరున్న డాక్టర్ గా ఉండేవాడు.

మీడియా ప్రతినిధి :  ( మధ్యలో కల్పించుకొని ) ఇంత సాఫీగా ఉన్న జీవితం నుండి రాజకీయాల వైపు ఎలా వచ్చారు ?
జయమ్మ గారు : డాక్టర్ గా ఉన్నప్పుడే, తండ్రి ద్వారా నేర్చుకున్న నాయకత్వ లక్షణాల తో స్థానిక రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవాడు. 1978 లో రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పులివెందుల శాసనసభ కు పోటీ చేసి మంచి మెజారిటీ తో గెలిచాడు. ఎన్నికల తర్వాత ఇందిరా కాంగ్రెస్ లో రెడ్డి కాంగ్రెస్ విలీనం అయింది. 1980 లో అంజయ్య గారి మంత్రి వర్గం లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, భవనం వెంకట్రామి రెడ్డి మంత్రి వర్గం లో ఆబ్కారీ మంత్రిగా,కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రి వర్గం లో విద్య శాఖ మంత్రిగా పని చేసాడు.

1983 లో ఎన్టీఆర్ గాలిలో కూడా పులివెందుల లో మంచి మెజారిటీ తో గెలిచాడు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా అతి చిన్నవయసులోనే పని చేసాడు. 1984 ఉపఎన్నికల్లో కూడా మంచిమెజారిటీ తో గెలిచాడు. 1989 లో రాజశేఖర్ రెడ్డి కడప లోకసభకు వెళ్లి తమ్ముడు వివేకానంద రెడ్డి ని పులివెందుల శాసనసభ కు పోటీ చేపించి ఇద్దరు గెలిచారు.

మీడియా ప్రతినిధి : 34 సంవత్సరాలకే పిసిసి ప్రెసిడెంట్ అయినా ఘనత ఉన్న మీ కొడుకు. 50 సంవత్సరాల వయసు వచ్చినా సిఎం కూర్చీని ఎందుకు అందుకోలేక పోయ్యాడు ?
జయమ్మ గారు : 1978 లో పులివెందుల ఎమ్మెల్యే అయ్యాక ప్రజా సమస్యలపైనా అధికారం లో ఉన్నా కూడా దూకుడుగా ప్రవర్తించడం తో కాంగ్రెస్ లోనే కొంతమందికి నచ్చేది కాదు. ఇది నా కొడుకు కొత్తగా అలవరుచుకున్నది కాదు చిన్నప్పటి నుండి ప్రజాసమస్యలను చూసి చలించి పోయే వాడు అందుకే అధికారంలో ఎవరు వున్నా ప్రజలకు మంచి జరగాలి అని భావించే వాడు. 1983 ఎన్టీఆర్ సినిమా గాలిలోకూడా గెలవడం, ప్రజా సమస్యలపైనా ఉన్న అవగాహన, చిత్తశుద్ధి రాజీవ్ గాంధీ గారిని ఆకర్షించి పిసిసి పదవి ఇచ్చారు. అతి చిన్నవయసులో పిసిసి అధ్యక్షుడు అయింది మా అబ్బాయే. ప్రజాసమస్యలపైనా దూకుడుగా పోరాటం, ముఖ్యంగా రాయలసీమ నీటి సమస్య పైన ఎన్నో పోరాటాలు చేసారు. ఈ దూకుడు పార్టీ లో ఉండే పెద్దలకు నచ్చేది కాదు, ఆ పరిస్థితుల్లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహ రావు గారు కూడా నా కొడుకు పైన కొంత కోపంగా ఉండేవారు. ఆ కోపం తోనే హైదరాబాద్ మత కలహాల్లోమా అబ్బాయి కి ఎటువంటి సంబంధం లేకున్నా కూడా ఆరోపణలు చేసారు.

మీడియా ప్రతినిధి: ఇటువంటింటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ?
జయమ్మ గారు: నా కొడుకు ఎప్పుడు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఇటు వంటి ఆరోపణలు రావడం బాధాకరం. పాపం తనకు కూడా అర్థం అయ్యేది కాదు ఇటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు తన మీద అంటూ.

మీడియా ప్రతినిధి :-
రాజకీయాలలో ఇలాంటివి ఉంటాయి అని తెల్సు , అలాగే సంవత్సరం ముందు మీ భర్తను కూడా పోగొట్టుకున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో మీ కొడుకును రాజకీయాల్లో ఎందుకు కొనసాగిస్తున్నారు ?
జయమ్మ గారు : నేను ఎప్పుడూ ప్రత్యేకంగా రాజకీయాల్లో లేను, ఈ మధ్యే చనిపోయిన మా అమ్మగారికి రాజకీయాలు అంటే అస్సలు నచ్చవు, తను ఎప్పుడూ చెప్తుండేది డాక్టర్ గా మంచి జీవితాన్ని వదిలేసి రాజకీయాలలో ఈ పోరాటాలు అంటూ తిరుగుతూ డబ్బులు వృధా చేసుకోవడం ఎందుకు అని. కానీ నా కొడుకు నా భర్త లాగా, నా భర్తకు రాజకీయాలంటే ఎక్కువ శ్రద్ధ. కొడుకు రాజకీయాలలో ఉండి ప్రజా సేవ చెయ్యాలని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకునే వారు.

మీడియా ప్రతినిధి : మీ అమ్మగారికి రాజకీయాలు నచ్చనప్పుడు మిమ్మల్ని పంచాయతీ ప్రెసిడెంట్ గా చెయ్యడానికి ఎలా ఒప్పుకున్నారు ?
జయమ్మ గారు : ప్రజలే ఒత్తిడి తెచ్చారు నా మీద కాబట్టే అవ్వాల్సి వచ్చింది.

మీడియా ప్రతినిధి : పులివెందులకు సర్పంచ్ గా ఎమ్మెల్యే గా మీ కుటుంబ సభ్యులే వున్నారు, ఇప్పటి వరకు మీరు సాధించిన ప్రగతి ఏంటి ?
జయమ్మ గారు : పులివెందుల సర్పంచ్ గా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎవరైనా ఇంటికి వచ్చి వారి సమస్యలునా దృష్టికి తెస్తే వాటిని పరిస్కరిస్తున్నాం. మా అబ్బాయి ఎమ్మెల్యే నేను సర్పంచ్ గా వున్నాము. పులివెందుల పంచాయతీ మాత్రమే అయినప్పటికీ పులివెందుల అంతా సిమెంట్ రోడ్ లు, ఇంటింటికి కులాయితో త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయగలిగాము. ఇంకా ఎంతో చేయాలానే తపన ఉంది కాని అధికారం లో లేము కాబట్టి అనుకున్నవన్నీ చేయలేకపోతున్నాము. ఈసారి గెలుస్తాం అప్పుడు ప్రతి సమస్యను పరిష్కరిస్తాం.
నా కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇచ్చిన ప్రతి మాటను చేసిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తాడు. ఇతర ముఖ్యమంత్రుల లాగా కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్ర బాబు లాగా మాటల మనిషి కాదు.

మీడియా ప్రతినిధి: మీ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఏమేమి చేస్తారు అని అనుకుంటున్నారు ?
జయమ్మ గారు : నాకు ఎలా తెల్సు కానీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడు రైతులకు మంచి చేస్తాడు. నా కొడుకు ముఖ్యమంత్రి అయితే రాయలసీమ కు నీటి విషయంలో లో మంచి జరుగుతుంది అనే నమ్మకం  ఉంది, అలాగే రాష్ట్రము లో సమస్యలు చాలా వరకు పరిస్కారం అవుతాయి, సుపరిపాలన అందిస్తాడని నమ్మకం ఉంది. రైతుల సమస్యలు అన్ని క్షుణ్ణంగా తెలుసు, స్వతహాగా రైతుకాబట్టి రైతు సమస్యలు అన్ని పరిష్కరిస్తాడు. చెప్తున్నట్టు ఉచిత విద్యుత్ కూడా అందిస్తాడు.

మీడియా ప్రతినిధి :  మీ భర్తను కోల్పోవడం ఈ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ?
జయమ్మ గారు : అదొక చేదు సంఘటన, మా కుటుంబానికి మా ప్రజలకు తీరని లోటు.
( మధ్యలో జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని )
జగన్మోహన్ రెడ్డి : మా తాత లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. ఈ ఎన్నికలలో ఆ లోటు స్పష్టంగా కనపడతా ఉంది. మేము ఎంత మంది ప్రయత్నించినా రాజంపేట కోడూరు ప్రాంతాలలో ఆ గ్యాప్ ను పూడ్చలేక పోతున్నాం. తాత బ్రతికి ఉంటే మా జిల్లా లోఎన్నికలు చూసుకునేవాడు, నాన్న రాష్ట్ర రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నాడు. పులివెందుల, జమ్మలమడుగు ఇటువైపు ఉన్న నియోజకర్గాల్లో బాగానే ఉన్నా కూడా రాజంపేట, రైల్వే కోడూరువైపు కాస్త సమయం ఎక్కువ కేటాయించలేకపోతున్నాం, సమయం కూడా తక్కువ ఉంది.

మీడియా ప్రతినిధి : ( జగన్ గారితో ) ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలతో వుంటున్న మీ నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యలేక పోతున్నారా ?
జగన్ గారు : మా నాన్న  ప్రజా సమస్యల మీద ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటారు . ఆయనను కలవడానికి వచ్చే వారు లేకుంటే సమస్యలు చెప్పుకోడానికి వచ్చే వారు ఇలా ఎప్పుడూ  ఇంట్లో ప్రజలు ఉంటారు. చాల బిజీ గా ఉంటారు. కానీ సమస్యల పరిష్కారం కోసం మన దగ్గరికి వచ్చే ప్రజలు దేవుళ్ళతో సమానం, సాధ్యమైనంత వరకు వారి సమస్యలను త్వరగా పరిష్కారం చెయ్యడానికి మనము ఎప్పుడూ వాళ్లకు అందుబాటులో ఉండాలి అని అంటుంటారు.

మీడియా ప్రతినిధి :- మీ మీద ఒక వైపు ఫ్యాక్షన్ ముద్ర వెయ్యడానికి ప్రత్యర్ధులు ప్రయత్నిస్తుంటే మీరేమో సేవ కార్యక్రమాలలో బిజి గా గడుపుతున్నారు ?
జగన్ గారు : మా నాన్న రాజకీయాల్లోకి రాకముందు ఉన్న మా ఆసుపత్రి లో ఇప్పటికి డాక్టర్స్ ని పెట్టి ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం. మా కుటుంభం ప్రారంభించిన విద్యాలయాల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మాకు ఈ సమస్య ఉంది అని ఎవరైనా వస్తే ఆ సమస్య పరిస్కరిస్తున్నాం.

మీడియా ప్రతినిధి: మీ రాజకీయ అరంగేట్రానికి మీ నాన్న గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా ?
జగన్మోహన్ రెడ్డి : ( నవ్వుతూ ) నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంటర్ కంప్లీట్ అయినప్పటి నుండే ఇక్కడ ప్రజలతో మమేకం అవుతున్నా, నాకున్న పరిధిలో సమస్యలు పరిష్కరిస్తున్న.

మీడియా ప్రతినిధి : పురుషోత్తం రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి అంటే ఎందుకు పులివెందులలో అంత గౌరవం ?
పురుషోత్తం రెడ్డి  : రాజశేఖర్ రెడ్డి ప్రజల్లో బాగా మమేకం అవుతాడు, పులివెందుల లో ప్రతి ఒక్కరికి ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం. ఎలాంటి సమస్య అయినా సునాయాసంగా పరిష్కరించగలిగే నాయకుడు.

“ఇంటర్వ్యూ ముగించి బయట ఊరిలో కొంతమంది రాజశేఖర్ రెడ్డిగారి గురించి ఎం చెప్పారంటే”

రమేష్ (పంజానపల్లి) : ఎవరెన్ని ఆరోపణలు చేసినా మానాయకుడు రాజశేఖర్ రెడ్డి, ఆయనతోనే ఉంటాం. మాకు ఏ సమస్య వచ్చినా ఆయనతోనే చెప్పుకుంటాం, పరిష్కరిస్తాడు. ప్రజలు ఆయన్ను అమితంగా ఇష్టపడతారు.
లాయర్ సాంబశివయ్య (కడప) : రాజశేఖర్ రెడ్డి చాలా దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్నాయి అభివృద్ధి, రాయలసీమ కు నీటి విషయంలో. ప్రజలతో మెలిగే తీరు అమోఘం. అయన లాంటి నాయకున్ని నేను అయితే చూడలేదు.
యాదుగురి వెంకట కృష్ణ రెడ్డి(బలపనూరు రైతు ) : శత్రువు వచ్చినా కూడా నవ్వుతు సహాయం చేసే గుణం. అయన లో నియంతృత్వ పోకడలు లేవు. ఎవరన్నా పోవచ్చు మాట్లాడొచ్చు ఆయ్యప్ప తో.

ఆంజనేయులు (పులివెందుల) : అయన మంచితనం కి, ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శనం మొన్న ఆయన నామినేషన్ వేసేటప్పుడు వచ్చిన జనమే. కడప జిల్లా లో ఆయన అంత చరిష్మా ఉన్నోడు లేడు. ఆయనన కడప కోటకు రారాజు అంతే !!

 

వై యెస్ ఆర్ కుటుంభం గురించి కాలగర్భంలో లో కలిసిపోయిన ఎన్నో మంచి విషయాలను మీ ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశంతో అన్నిటిని వెలికి తిస్తున్నాం. మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఉంటే మాతో పంచుకోండి మేము వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తాం.
మా మెయిల్ ఐడి jagankosam.com@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *