పోలవరం కాదు అది వై ఎస్ ఇచ్చిన వరం

పోలవరం….. అది పోలవరం కాదు ఈ రాష్ట్రానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన వరం, అది ” వై ఎస్ ఆర్ వరం” . పోలవరం చరిత్ర ఇప్పుడు మొదలయ్యింది కాదు, 75 సంవత్సరాల ముందు 1941 నాటి మద్రాసు ప్రసిడేన్సి కాలంలో  బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన అప్పటినుండి దాదాపు 40 సంవత్సరాలు అక్కడే ప్రతిపధనగానే ఉండిపోయింది. ఈ మధ్యలో ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఎన్నో ప్రబుత్వాలు వచ్చాయి , ఈ జనం ఎందరో మంత్రుల్ని ముఖ్యమంత్రులని, ప్రధాన మంత్రుల్ని చేసారు చూసారు ,  కాని ఒక్కరు కూడా పోలవరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు . తిరిగి 1981 నాటి ముఖ్యమంత్రి అంజయ్య దానికి శంకుస్థాపన చేశారు. 

ఇది ఒక మల్టి  పర్పస్ ప్రాజెక్ట్ ఇలాంటిది ప్రపంచంలోనే రెండు మూడు వున్నాయి అంతే , అటువంటి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రైతుల కోసం రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టారు. అని సాక్ష్యాత్తు గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎం ఎస్ స్వామినాథన్ గారు అన్నారు అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. 301 టీఎంసీల వినియోగ సామర్థ్యంతో రూపొందిన ఈ ప్రాజెక్టువల్ల ఏడున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడుతుంది. విశాఖ పట్నం తాగునీటి అవసరాలతోపాటు ఆ కారిడార్ పారిశ్రామిక అవసరాలను కూడా ఇది తీరుస్తుంది. అలాగే కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల గోదావరి నీటిని బదిలీ చేస్తుంది. పోలవరం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం కారణంగా ఈ 80 టీఎంసీల నీటిని అవసరాన్ని బట్టి కృష్ణానదికి బదిలీచేస్తారు. ఇలా బదిలీ చేసిన నీటిలో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీల వాటాపై హక్కు లభిస్తుంది. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆ రాష్ట్రాలు తమకు కేటాయించిన జలాలకు అదనంగా ఈ 35 టీఎంసీల నీటిని ఆపుకొని మిగతా నీటిని కిందకు వదులుతాయి. కృష్ణాజలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కున్న 800 టీఎంసీల వాటాకు తోడు ఈ 45 టీఎంసీలు (గోదావరి నుంచి వచ్చే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా 35 టీఎంసీలు పోను) నికర జలాలుగా మన ప్రాజెక్టులకు లభిస్తాయి. నికర జలాలే లేకుండా కేవలం కృష్ణా మిగులు జలాల(వరద)పైనే ఆధారపడిన ఎనిమిది ప్రాజెక్టులు ఇప్పటికే రాయలసీమ, దక్షిణ తెలంగాణలో ఉన్నాయి. వాటికి ఈ 45 టీఎంసీల నికర జలాలు గొప్ప ఊరట. పైగా 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఈ ప్రాజెక్టులో భాగం.

గోదావరి డెల్టా ఆయకట్టులో 10.5 లక్షల ఎకరాలకు 2 పంట లకు నీరు అందుతుంది. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 7.2 లక్షల ఎకరాలలో కొత్తసాగుకు నీరందుతుంది. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని తరలించి 13 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణకు దోహ దం చేయవచ్చు. విశాఖపట్నం ఇంకా 540 గ్రామా లకు తాగు, పారిశ్రామిక అవసరాలకు 25 టీఎంసీల నీరు ఇవ్వవచ్చు. 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి చేర్చడం ద్వారా, శ్రీశైలం నుంచి నీటి విడు దలను తగ్గించి, ఆదా అయిన 45 టీఎంసీల నీటిని తెలంగాణ, రాయలసీమలకు వినియోగించుకోవచ్చు. ఇంకా 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 308 టీఎంసీలు మనం వినియోగంలోకి తీసుకురా వచ్చు. తూర్పు గోదావరి జిల్లాలో 2.57 లక్షల ఆయ కట్టుకు, విశాఖజిల్లాలో 2.67 ఎకరాల ఆయకట్టుకు నీటిని; కాకినాడ, విశాఖలకు పోలవరం ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుంది.

ఏదైనా ఇటువంటి ప్రాజెక్ట్ కట్టాలి అని అనుకున్నప్పుడు కేంద్రానికి సంబందించిన అటవీ శాకా, వన్య ప్రాణుల బోర్డు, పర్యవరన పరిరక్షణ, ట్రైబల్ లాంటి వివిధ బోర్డుల నుండి పెర్మిషణ్ లు తెచ్చుకోవాలి. దానికి గాను మన రాష్ట్రం నుండి మన రాష్ట్ర ప్రబుత్వం కేద్రం లోని వివిధ బోర్దులకు లెటర్ రాయాల్సి వుంటుంది కాని, 1981 లో అంజయ్య గారు శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన ఎన్టిఆర్ కాని నాదెండ్ల భాస్కర్ రావు కాని మర్రి చెన్న రెడ్డి కాని ,  నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కాని ఆకరికి కేంద్రం లో చక్రం తిప్పాను అని చెప్పుకున్న చంద్ర బాబు కాని పోలవరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మల్లి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం ఊపిరి పోసుకుంది.

ఓ వైపు ఇక్కడ ప్రతి పక్షాల రాద్ధాంతం మరో వైపు అటు ఒరిస్సా , కర్ణాటక, మధ్యప్రదేశ్  ప్రబుత్వాల నుండి తీవ్ర ఒత్తిడులు, మరో వైపు ఒకటికి పది సార్లు  కేంద్రం దగ్గరకు క్లియరెన్స్ కోసం వెళ్ళడం, ఇన్ని వత్తిడుల మధ్య ఇలాంటి ప్రాజెక్టు ను ముందుకు తిసుకేల్లడం ఒక్క వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారికే మాత్రమే సాధ్యం, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే పోలవరం ఊపిరి పోసుకుంది, నాటి నుండే పోలవరం ముంపు గ్రామాల్లో ప్రజలను పోలవరం యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తూ, వాళ్ళకు ప్రబుత్వం తరపున ఏర్పాటు చేసే నష్టపరిహారం గురించి అక్కడి గ్రామాల్లో అలాగే ముంపు ప్రాంతాల్లో వున్న గిరిజనుల హక్కుల విషయం లో అక్కడి గ్రామాల్లో ఎకాబిప్రయం కోసం కలెక్టర్ సదస్సులు ఏర్పాటు చేసి విజయం సాదించారు వై ఎస్ ఆర్ గారు. ఆ తర్వాతి సంవత్సరమే ముంపు గ్రామాలకు కాలనీలను ఏర్పాటు చెయ్యడంలో సఫలం అయ్యారు 2006 ఏప్రిల్ నాటికే దాదాపు 6 కాలనీల పనులు ప్రారంబించారు. రాజశేఖర్ రెడ్డి గారి హయంలో  కుడి, ఎడమ కాలువల పనులతోపాటు హెడ్‌వర్క్స్‌లో భాగంగా స్పిల్‌వే, ట్విన్ టన్నెల్స్, కుడి, ఎడమ కనెక్టివిటీస్ నిర్మాణ పనులూ మొదలయ్యాయి. అయితే నిర్మాణపనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ అనుకున్నంత వేగంగా పనులు చేయకపోవడంతో విడివిడిగా ఇచ్చిన స్పిల్‌వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్‌హౌస్ టెండర్లను వైఎస్ రద్దు చేశారు.

2004 లొ వై.యస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పాడు పడిన శిలాఫలకాలకి పాలాభిషేకం చేసి 10 వేల 151 కొట్ల వ్యవం అని పని మొదలుపెట్టించారు వెంటనే 1,320 కొట్లు ఒకసారి, 1,353 కొట్లు ఒక సారి విడుదల చేసారు

2005 సెప్టెంబర్ 19 న స్థలం క్లియరెన్స్ సాధించారు.
2005 అక్టొబర్ 25 న పర్యావర్ణం క్లియరెన్స్ సాధించారు

జూన్ 9 2009 న నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ సాదించారు
2007 ఏప్రిల్ 17 న ఆర్.ఆర్ క్లియరెన్స్ సాధించారు.
2008 సెప్టెంబర్ 19 న వైల్డ్ లైఫ్ స్యాంచురీ క్లియరెన్స్ సాధించారు.
2008 డిసెంబర్ 6 న అటవి శాఖ నుండి క్లియరెన్స్ సాధించారు.
2009 జనవరి 20 న టెక్నికల్ ఎడ్వైజరీ కమిటి క్లియరెన్స్ సాధించారు

ఇలా ఏ క్లియరెన్స్ లేకుండా ఇది ప్రజల ప్రాణవాయువు లాంటి ప్రాజెక్ట్ అని మొదలు పెట్టి, క్లియరెన్స్ లేకుండా ఎలా కడతారు అని ఎన్ని విమర్సలు వచ్చినా పట్టించుకొకుండా చివరికి కడుతూనే అన్ని క్లియరెన్సులు సాధిన వ్యక్తి వై.యస్. ఇలా సుమారుగా 2009 నాటికి 10 వేల కొట్ల ప్రాజెక్టుకి 4 వేల కొట్లు కర్చు చేసి ఇంకొ 3 ఏళ్ళలొ ప్రాజెక్టు కచ్చితంగా పూర్తి చేస్తాను అని చెప్పిన సమయం లొ ఆయన మరణించారు. తరువాత ప్రాజెక్టు అటక ఎక్కటం , విభజన జరగటం , వై.యస్ విజన్ ని కెంద్రం గుర్తించి పొలవరం కి జాతీయ హొదా ఇవ్వటం జరిగింది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత పోలవరం పనులు ఆగిపోయాయ, పోలవరానికి వై ఎస్ ఆర్ గారికి వున్నా బంధం గురించి చెప్పుకోవాలంటే రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి . ఒకానొక సంధర్బంలో ఒక మీడియా ప్రతినిధి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని పోలవరం గురించి అడిగినప్పుడు, 2009 లో చనిపోయింది వై ఎస్ ఆర్ గారు గారు పోలవరం అని అన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు అలాగే రాష్ట్ర విభజన సంధర్బంలో రైతులతో అప్పటి టిడిపి కాంగ్రెస్స్ నేతలు మీటింగ్ ఏర్పాటు చేసారు ఆ మీటింగ్ లో ఒక టిడిపి సీనియర్ నాయకుడు మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణంతో పోలవరం పనులు ఆగిపొయ్యాయి అని అన్నాడు .

పోలవరం అనే ఆలోచన పుట్టింది 1941 లో అయినా దానికి ప్రాణం పోసింది వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే అని అనడానికి ఈ క్రింద ఇచ్చిన డాక్యుమెంట్ ఒక ఉదాహరణ. ఇది మన పక్కన వున్నా ఒరిస్సా ప్రబుత్వం యెక్క వాటర్ రిసోర్స్ డిపార్టుమెంటు 2008 – 2009 వార్షిక రిపోర్ట్ కింద నవంబర్ 2009 న పోలవరం కు సంబంధించి ఇచ్చిన రిపోర్ట్ .

Annual Report for 2008-2009 of Department of Water Resources,

Government of Orissa (November 2009)

CHRONOLOGY OF IMPORTANT EVENTS RELATING TO POLAVARAM PROJECT

S.No. Date Particulars
1. July, 1941 Original conceptualization of project by the then Madras Presidency
2. 1951 Sir SV Rama Murthy proposed a Ramapadasagar scheme with 130meters dam height and a 1500MW of power generation capacity, but it was not pursued due to geological reasons.
3. 1965 A technical committee headed by AC Mitra recommended a barrage at Polavaram to irrigate uplands.
4. April, 1969 Godavari Water Disputes Tribunal was formed
5. 1969 Andhra Pradesh government named the project as Polavaram and made a case before the tribunal for river control work at Polavaram
6. 1970 Andhra Pradesh presented a project report for Polavarasssm barrage with 145ft height dam and two canals.
7 1978 Andhra Pradesh submitted another project report to the Central Water Commission for construction of earth-cum-rock fill dam at 150ft height
8. 04-08-1978

11-07-1979

02-04-1980

Inter-state agreements with Karnataka, Madhya Pradesh and Orissa with a dam height of 150ft.  CWC considered project as a barrage and hence accepted 36 lakhs cusecs as the spillway design flood for Polavaram.
9. 03-04-1980 Agreements placed before Godavari Tribunal and finalized
10. 16-09-2005 EIA-EMP updated by M/s AFC Ltd. Hyderabad during 2005 submitted to MoEF including an incomplete report on dam-break analysis.
11. 4,5-09-2005 The Expert Committee constituted by the MoEF visited the project site.
12. 10-09-2005 APPCB publishes notification for public hearing to be held on 10-10-05
13. 16-09-2005 Application for site clearance filed
14. 16-09-2005 EIA submitted to MoEF
15. 16-09-2005 Chief Engineer, Indira Sagar Project, wrote to Member Secretary Orissa Pollution Control Board seeking clearance.
16. 17-09-2005 MoEF asks clarifications on EIA
17. 19-09-2005 MoEF gives site clearance
18. 29-09-2005 Chief Engineer, Indira Sagar project writes to District Collector, Malkangiri, Orissa seeking rehabilitation details
19. 10-10-2005 Public hearing held at 5 places in E.Godavari, W.Godavari, Khammam, Visakhapatnam and Krishna (Excluding Orissa and Chattisgarh)
20. 18-10-2005 AP Pollution Control Board grants consent letter to establish the project
21. 19-10-2005 A power point presentation given in the Expert Committee meeting held at Ministry of Environment and Forest (MoEF)
22. 20-10-2005 Replies to the queries posed by the Experts submitted to MoEF
23. 25-10-2005 Ministry of Environment and Forest clearance
24. 12-12-2005 Application for forest clearance
25. 16-01-2006 Application for Resettlement & Rehabilitation Clearance
26. February, March-2006 AP High Court hears a batch of writ petitions filed by some political parties opposing the project and the judgment reserved
27. 27-04-2006 Central Empowered Committee (CEC) of Supreme Court advises Andhra Pradesh Government to stop works of the project when it heard objections raised by tribal rights activists and environmentalists
28. 30-04-2006 Andhra Pradesh Government complies with CEC suggestion and stops the project works
29. 10-07-2006 Central wildlife board gives clearance
30. 29-07- 2006 The CEC of SC tours Andhra Pradesh and visits the project sites.
31. 22-03-2006 Orissa High Court passes orders over a writ petition restraining AP from submerging lands in Orissa due to Polavaram Project.
32. 25-04-2006 MoEF accepts Orissa High Court order and informs AP state to make it an addendum to Environment clearance letter dt. 25-10-2005
33. 09-06-2006 Wild life aspects clearance from The National Board Of Wildlife
34. 17-04-2007 R&R by Ministry of Tribal Affairs
35. 19-09-2008 Wild Life Sanctuary clearance from supreme court
36. 10-01-2009 To avoid submersion in Orissa AP state proposes Rs.600 crore embankments project and submits to MoEF for Environmental clearance
37. 15-01-2009 For consideration by the TAC Union Ministry of Water Resources asks MoEF on the status of Environmental clearance for combined Project
38. 20-01-2009 MoEF Considers that embankments project is treated as change of scope of Polavaram and wants fresh Environmental Appraisal of Polavaram.
39. 20-01-2009 Technical Advisory Committee Clearance
40. 17-02-2009 Environmental Appraisal committee considers Embankments project and directs AP to get public hearings conducted in Orissa and Chattisgarh.
41. 27-04-2010 Petition filed by Chattisgarh Environmental Protection Board for transferring cases pending against Polavaram project in AP High Court to the Supreme Court is posted for hearing during August 2010.

2004 నవంబర్ 9 న పోలవరం  ప్రాజెక్టుకు బూమి పూజ చేసిన వై ఎస్ ఆర్ గారు

రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే, అయన సాదించిన క్లియరెన్స్ లు వాటి వివరాలు అప్పటి పేపర్లల్లో

సెప్టంబర్ 19 2005 న పోలవరం కు కేంద్రం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది

అక్టోబర్ 25 2005 న పర్యావరణ క్లియరెన్స్ సాదించిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు

జూన్ 9 2009 న నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ సాదించిన వై ఎస్ ఆర్ గారు, అలాగే 2008 సెప్టంబర్ 19 న సుప్రీం కోర్ట్ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్  సాదించిన వై ఎస్ ఆర్ గారు

ఏప్రిల్ 17 2007 న ఆర్ . ఆర్ క్లియరెన్స్ సాదించిన వై ఎస్ ఆర్ గారు

2008 డిసెంబర్ 6 నా అటవీ శాక నుండి క్లియరెన్స్ సాదించిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు , అలాగే జనవరి 20 2009 న టెక్నికల్ అడ్వైజరీ కమిటి క్లియరెన్స్ సాదించిన వై ఎస్ ఆర్ గారు

పోలవరం ప్రాజక్టును సమర్ధిస్తున్న ఎం ఎస్ స్వామినాథన్ గారు

పోలవరం నిర్వాసితులకు సంబంధించి పునరావాసం నష్టపరిహారం దానికి సంబంధించి నాటి పత్రికలో వచ్చిన వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి అంటూ పత్రికలో వచ్చిన వార్త

వై ఎస్ ఆర్ గారి మరణంతో పోలవరం పనులు ఆగిపొయ్యాయి అంటున్న టిడిపి సీనియర్ నేత

పోలవరంకు సంబంధించి వివిధ పత్రికలలో వచ్చిన వివిధ వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *