ఆ రోజు రాజన్న నా కులం చూడలేదు

నేను రెడ్డిని కాదు నేను రెడ్డి కులంలో పుట్టలేదు  నాది కాపు సామాజిక వర్గం నాది రాయలసీమ కాదు మాది కృష్ణ జిల్లాలోని కంకిపాడు  మండలం ఈ రోజు అధికారంలో వున్న వాళ్ళ కుల పిచ్చిని వాళ్ళ ప్రాంతాభిమానాన్ని చూసి ఇలా ఇది రాస్తున్నాను .

  •  నేను ఒక రైతును సన్న కారు రైతును 2004 వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెట్టాడు ఆ రోజు వై ఎస్ నా లోని రైతును చూసాడు కాని మా ప్రాంతాన్ని చూడలేదు , నేను పండిస్తున్న పంటను చూసాడు కాని  నా కులాన్ని చూడలేదు .
  • మా కొడుకు ఇంటర్ చదివాడు ఒకప్పుడు నేను ఇంటర్ వరకు చదివి పై చదువులు చదివే స్తోమత లేక ఇంటర్ తో ఆపేసాను వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్య అందించడంతో మా కొడుకు పై చదువులు చదివాడు ఇంజనీరింగ్ చదివాడు ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అదే ఆ రోజు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్య ఇవ్వకుండా ఉండుంటే ? ఆ పధకాన్ని కేవలము తన కులానికే పరిమితం చేసుకొని ఉండుంటే ఈ రోజు నా కొడుకు నాతో పాటు కూలి పని చేసుకుంటూ వుండే వాడు .
  • ఆరోగ్య శ్రీ తో మా నాన్న గుండెకు పడిన చిల్లును ఉచితంగా పూడ్చాడు ఆ రోజు కేవలము నాకు వున్న రేషన్ కార్డ్ చూపించమని అడిగారు కాని కులం కార్డు అడగలేదు అదే ఆ రోజు వై ఎస్ రాజశేకర్ రెడ్డి తన కులానికే ఆరోగ్య శ్రీ పధకం అందేలా చేసుంటే నాకు రెండే దారులు ఒకటి వున్నా కొద్ది పాటి పొలాన్ని అమ్మి మా నాన్నకు ఆపరేషన్ చేపింఛి పొలం లేదు కాబట్టి మరుసటి రోజు నుండి నా పొలంలోనే కూలి గా వెళ్ళడం రెండు ఈ జీవితంలో ని ఋణం తీర్చుకోలేను నాన్నా నన్ను క్షమించు ని గుండె చిల్లు పూడ్చే ఆర్ధిక స్తోమత ని కొడుక్కు లేదు అని మా నాన్న కాళ్ళ మీద పడి ఆశలు వదులుకోవడం , కాని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి పరిస్థితి రానివ్వలేదు .
  • అత్యవసర సమయాల్లో 108 కు ఫోన్ చేసినా వాళ్ళు ఎప్పుడు నీది ఏ కులం నీది పాలన కులం అయితేనే 108 లో తీసుకేల్తాం అని అనలేదు .
  • రెండు లక్షలు నాకు రుణమాఫీ జరిగింది ఆ రోజు వై ఎస్ నా కులం అడగలేదు కదా కనీసం ఆ రేషన్ కార్డ్ కూడా అడగలేదు , ఆ రోజు తన కులం కాకపోయినా నాకు రెండు లక్షలు రుణమాఫీ జరిగేల చూసి నన్ను నా కుటుంభాన్ని ఆదుకున్నాడు ఆ రోజు రుణమాఫీ విషయం లో అర్హుల జాబితా కోసం జన్మభూమి కమిటి అని ఈ కమిటి అని ఆ కమిటి అని వేసి వుంటే నాకు ఋణ మాఫీ జరిగేది కాదు చివరికి నేను అప్పులు కట్టుకోలేక అవమానాలు బరించలేక కాటిలో కట్టేనయ్యి కలాల్సింది కాని ఆ రోజు కూడా వై ఎస్ నా కులం చూడలేదు .
  • అంతక ముందు వున్న ప్రబుత్వం  వ్యవసాయానికి సంబంధించి నా బోరుకు మీటర్లు బిగించి కేసు పెట్టారు వై ఎస్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆ కేసులు అన్ని కొట్టేసారు ఆ రోజు కూడా వై ఎస్ నా లోని రైతును చూసాడు కాని నా కులాన్ని చూడలేదు .
  • డ్వాక్ర మహిళలలకు సంబంధించి 25 పైసలకు రుణాలు మంజూరు చేసారు మహిళలు దేశ ఆర్ధిక ప్రగతికి వెన్నెముక లాంటి వాళ్ళు అని నమ్మారు కాని ఆ రోజు వాళ్ళ కులాన్ని చూడలేదు .
  • ఇలా ఒకటేమిటి రెండు రూపాయల కిలో బియ్యం అవచ్చు రాజీవ్ యువశక్తి అవ్వచ్చు ఎన్నో పధకాలకు అయన అర్హులను పేదవారిని చూసుకున్నారు కాని కులాన్ని చూడలేదు

కాని ఇప్పుడు వున్నా నాయకులకు ఎందుకు అంత కుల పిచ్చి ఋణ మాఫీ కి అర్హులను ప్రకటించేది బ్యాంకుల లేక జన్మభూమి కమిటిలా ? ఋణ మాఫీ జరగాలంటే వాళ్ళు అడిగిన పత్రాలు అన్ని సేకరించడానికి ఓ నెల పాటు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగాను దానికి నాకు అయిన కర్చు అక్షరాలా 3000 రూపాయలు కాను అక్కరికి నాకు జరిగిన ఋణ మాఫీ 125 రూపాయలు . ఒక్కటేమిటి ఏది చూసుకున్న ఇప్పుడు ఈ పాలకులు ప్రతి సంక్షేమ పధకాన్ని కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా పార్టీల వారిగా విబజించి చేస్తున్నారు .

నేటి ఈ పాలకుల లాగా నాడు వై ఎస్ నా కులాన్ని చూసుంటే నాకు ఉచిత విద్యుత్ అందేది కాదు నా కొడుక్కు ఉచిత విద్య అందేది కాదు మా నాన్న గారికి ఆరోగ్య శ్రీ వర్తించేది కాదు నాకు రుణ మాఫీ జరిగేది కాదు చివరకు మా నాన్నను పోగొట్టుకోవాల్సి వచ్చుండేది అప్పుల బాధ తట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక నేను ఆత్మ హత్యా చేసుకోవాల్సి వచ్చుండేది నాకొడుకు పై చదువుకోలేక ఆ ఆర్ధిక స్తోమత లేక ఇంటర్ తో చదువు ఆపేసి ఏ విధంగా అయితే ముప్పై సంవత్సరాల ముందు ఒక కూలిగా నా జీవితాన్ని ప్రరంబించానో అదే విధంగా నేడు నా కొడుకు అదే పొలం లో కూలిగా జీవితాన్ని ప్రరంబించాల్సి వచ్చుండేది.

వై ఎస్ వున్నప్పుడు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తాను మొదలు పెట్టిన ప్రతి సంక్షేమ పధకాన్ని పేదలకు అందేలా చూసాడు ఆ రోజు వై ఎస్ ప్రవేశ పెట్టిన ప్రతి పధకానికి నేను లబ్ది దారున్ని ఆ రోజు వై ఎస్ నా కులం చూడలేదు నా మతాన్ని చూడలేదు నేను ఏ పార్టికి వోటు వేసాను అని చూడలేదు , వై ఎస్ కేవలం నాలోని మనిషిని చూసాడు నా ఆర్థిక స్తోమతను చూసాడు నా పేదరికాన్ని చూసాడు నాలో వున్నా రైతును చూసాడు కాని నేడు నేను ఓటు వెయ్యడానికి వై ఎస్ కుటుంభం యెక్క కులాన్ని చూస్తున్నా శబాష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *